నాని నాలుక నిలువునా చీరేస్తాం: కోలా ఆనంద్

మంత్రి కొడాలి నాని నాలుక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీనేత కోలా ఆనంద్. హిందు మతం మీద, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాని నాలుక నిలువునా చీరేస్తామన్నారాయన. మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మంత్రి పదవి కోసం నాని శిలువలు వేసుకుని దొంగాటలు ఆడుతున్నాడని కోలా ఆరోపించారు. ఏడాదికోసారి జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుని వెళ్తున్న కొడాలి నాని.. అదే తిరుమల […]

  • Venkata Narayana
  • Publish Date - 11:32 am, Tue, 22 September 20
నాని నాలుక నిలువునా చీరేస్తాం: కోలా ఆనంద్

మంత్రి కొడాలి నాని నాలుక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీనేత కోలా ఆనంద్. హిందు మతం మీద, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాని నాలుక నిలువునా చీరేస్తామన్నారాయన. మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మంత్రి పదవి కోసం నాని శిలువలు వేసుకుని దొంగాటలు ఆడుతున్నాడని కోలా ఆరోపించారు. ఏడాదికోసారి జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుని వెళ్తున్న కొడాలి నాని.. అదే తిరుమల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని కోలా విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని అయన చెప్పుకొచ్చారు. ‘ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరిగితే పోతేపోయిందిలే అంటాడా.. దుర్గగుడిలో రథం సింహాలు పోతే.. పోతే పోయాయిలే అంటాడా.. అలాంటి వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు రావడానికి వీల్లేదు’ అని కోలా ఆనంద్ హెచ్చరించారు.