చెయ్యని తప్పుకు 37 ఏళ్ల జైలుశిక్ష… పరిహారంగా రూ. 149 కోట్లు

నందమూరి బాలకృష్ణ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా చాలామంది గుర్తుండే ఉంటుంది. అందులో బాలకృష్ణ నేరం చేశాడో లేదో తెలియదు కాని జైళ్లో మాత్రం శిక్షను అనుభవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పబోయే వార్తలో మాత్రం ఏ తప్పు చేయకుండానే ఓ వ్యక్తి దశాబ్దాల పాటు శిక్షను అనుభవించాడు.. అమెరికాకు చెందిన క్రెయిగ్ కోలే అనే 71 ఏళ్ల వ్యక్తిని… 1978లో అరెస్ట్ చేశారు పోలీసులు. తన మాజీ ప్రేయసినీ, ఆమె కొడుకును హతమార్చాడనే అభియోగంతో […]

చెయ్యని తప్పుకు 37 ఏళ్ల జైలుశిక్ష... పరిహారంగా రూ. 149 కోట్లు

Edited By:

Updated on: Mar 03, 2019 | 3:31 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా చాలామంది గుర్తుండే ఉంటుంది. అందులో బాలకృష్ణ నేరం చేశాడో లేదో తెలియదు కాని జైళ్లో మాత్రం శిక్షను అనుభవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పబోయే వార్తలో మాత్రం ఏ తప్పు చేయకుండానే ఓ వ్యక్తి దశాబ్దాల పాటు శిక్షను అనుభవించాడు.. అమెరికాకు చెందిన క్రెయిగ్ కోలే అనే 71 ఏళ్ల వ్యక్తిని… 1978లో అరెస్ట్ చేశారు పోలీసులు. తన మాజీ ప్రేయసినీ, ఆమె కొడుకును హతమార్చాడనే అభియోగంతో క్రెయిగ్ కోలేను అరెస్ట్ చేసిన పోలీసులు… అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసును విచారించిన పోలీసులు… రెండేళ్ల తర్వాత క్రెయిన్ కోలే ఏ తప్పు చేయలేదని, అతనిపై తప్పుడు అభియోగాలు నమోదయ్యాయని తేల్చారు.

కోర్టు మాత్రం అతడిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు జైలు శిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచి 39 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు క్రెయిన్ కోలే. తాజాగా కోలే కేసును టేకప్ చేసిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్… అతను ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు. హత్యకు గురైన క్రెయిగ్ కోలే మాజీ ప్రేయసి, ఆమె కొడుకు DNA లను పరీక్ష చేయగా… అసలు విషయం బయటపడింది. దాంతో కాలిఫోర్నియా గవర్నర్ క్రెయిన్ కోలేకు క్షమాపణలు చెబుతూ… జైలు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించిన అతనికి నష్టపరిహారంగా 21 మిలియన్ డాలర్లను (దాదాపు 149 కోట్ల రూపాయలు) చెల్లిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే… క్రెయిగ్ కోలేలాగే అమెరికన్ జైళ్లలో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న వారు వందల్లో ఉండడం. ఈ మధ్యే తల్లిని చంపాడనే అభియోగంతో ఒకతడిని అరెస్ట్ చేసి… 19 ఏళ్లు జైల్లో ఉంచిన తర్వాత సదరు వ్యక్తి నిర్దోషి అని తేలింది. తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్న వారిని వెతికి వెంటనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు అధికారులు.