నన్ను శారీరకంగా కాకుండా మానసికంగా వేధించారు : అభినందన్

| Edited By:

Mar 03, 2019 | 11:32 AM

పాకిస్థాన్‌లో బందీగా ఉన్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ఆర్మీ మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ అతడిని శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లుంది. అభినందన్ పాకిస్థాన్‌లో దాదాపు 60 గంటలు ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే.. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అభినందన్‌ను గత బుధవారం పాక్ ఆర్మీ బంధించిన సంగతి తెలిసిందే. […]

నన్ను శారీరకంగా కాకుండా మానసికంగా వేధించారు : అభినందన్
Follow us on

పాకిస్థాన్‌లో బందీగా ఉన్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ఆర్మీ మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ అతడిని శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లుంది. అభినందన్ పాకిస్థాన్‌లో దాదాపు 60 గంటలు ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే.. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అభినందన్‌ను గత బుధవారం పాక్ ఆర్మీ బంధించిన సంగతి తెలిసిందే. పీవోకేలో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ అభినందన్ గాయాలతో బయటపడ్డాడు. ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతలోనే పాక్ ఆర్మీ అభినందన్ ను అదుపులోకి తీసుకుని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో, జెనీవా ఒప్పందం ప్రకారం పాక్.. అభినందన్‌ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్‌కు పాక్ అప్పగించింది.