బిగ్ బాస్ సీజన్ 4 లో గెస్ట్ లు చాలా తక్కువే అని చెప్పాలి. గత సీజన్స్ లో చాలా మంది సెలబ్రెటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి సందడి చేశారు. హౌస్ లోపలి వెళ్లి మరి ఇంటిసభ్యులతో ముచ్చటించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి ఎక్కువమంది బిగ్ బాస్ వేదికపైన సందడి చేయలేదు. మొన్నామధ్య నాగార్జున లేని సమయంలో అక్కినేని సమంత బిగ్ బాస్ ను హోస్ట్ చేసి ఆకట్టుకుంది. అదే రోజు యంగ్ హీరో అఖిల్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి తన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను ప్రమోట్ చేసుకున్నాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఎంట్రీ ఇచ్చాడు. నాగ్ తో కలిసి కాసేపు సందడి చేసాడు సుదీప్. హౌస్ మేట్స్ తో ముచ్చటించిన సుదీప్ ముక్కు అవినాష్ ను ఇరకాటంలో పెట్టాడు.
హౌస్ లోఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరని పెళ్లి చేసుకుంటావ్ .? ఎవరితో డేట్ చేస్తావ్ .? ఎవరని చంపుతావ్ .? అని అడగ్గా.. మోనాల్‌తో డేట్, హారికతో పెళ్లి, కానీ అరియానాను మాత్రం చంపుతానని చెప్పుకొచ్చాడు అవినాష్. ఇక అదేవిధంగా హారికాను విధేయత ముఖ్యమా ..? గెలుపు ముఖ్యమా .? అని ప్రశ్నించగా విధేయతే ముఖ్యమని సమాధానం చెపింది హారిక . ఇక అభిజీత్‌కు హారిక షార్ట్ హెయిర్‌తో ఉంటే ఇష్టమా? పొడువు జుట్టుతో ఉంటే ఇష్టమా? అన్న ప్రశ్నకు చిన్న జుట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు అభి.ఇక అరియనాను ఒక్కరోజు నువ్వు అవినాష్‌లా మారి నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఏంటి? అని అడగ్గా అస్సలు నిద్రలో నుంచే లేచే ప్రసక్తే లేదని చెప్పింది. ఇక సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ ను చికెన్ అంటే ఇష్టమా.? లేక మటన్ అంటే ఇష్టమా.? అని సుదీప్ ప్రశ్నించారు. దానికి మటన్ అంటే ఇష్టమని చెప్పాడు సోహెల్. ఆతర్వాత మోనాల్ ను పిలవబోయి అఖిల్ ను పిలిచారు సుదీప్. దానికి నాగ్ వెంటనే ఆ ఇద్దరిలో ఎవరిని పిలిచినా ఒక్కటే అని పంచ్ వేశారు. ఆతర్వాత నీకు హౌస్ మేట్స్ లో ఒకరిని మాయం చేసే శక్తి ఉంటే ఎవరిని మాయం చేస్తావ్.? అని ప్రశ్నించగా అఖిల్ మోనాల్ పేరు చెప్పాడు. చివరగా మోనాల్ ను నీగురించి నువ్వు ఒక పుకారు చేసుకోవాలంటే ఏ పుకారు మొదలుపెడతావ్.? అని అడగ్గా నేను ఎప్పుడు ఏడవను అని చెప్పుకుంటా అంటూ సమాధానం ఇచ్చింది. గుజరాతి అమ్మాయి అయ్యుండి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావ్ అని మోనాల్ ను పొగిడారు సుదీప్. నాగార్జునను చూస్తూ తెలుగులో ఒక డైలాగ్ చెప్పు అంటే ముద్దుముద్దుగా ‘నువ్వు నాకు చాలా ఇష్టం’ అని చెప్పింది. ఇలా సుదీప్ అడిగిన ప్రశ్నలకు హౌస్ మేట్స్ సమాధానాల చెప్పుకొచ్చారు.