Bigg Boss4 : బిగ్ బాస్4 పై తన అభిప్రాయం తెలిపిన పరుచూరి .. టాప్ 5లో ఆ ఇద్దరు ఉండొచ్చట !

రియాలిటీ షో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. చిన్నపెద్ద అంతా ఈ గేమ్ షో ఆస్వాదిస్తారు. ఇక తెలుగులోనూ బిగ్ బాస్  మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా ప్రస్తుతం నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది.

Bigg Boss4 : బిగ్ బాస్4 పై తన అభిప్రాయం తెలిపిన పరుచూరి .. టాప్ 5లో ఆ ఇద్దరు ఉండొచ్చట !
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 30, 2020 | 12:06 PM

రియాలిటీ షో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. చిన్నపెద్ద అంతా ఈ గేమ్ షో ఆస్వాదిస్తారు. ఇక తెలుగులోనూ బిగ్ బాస్  మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా ప్రస్తుతం నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ 4 ఇప్పటికి 12 వారలను పూర్తి  చేసుకుంది.మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్ ఇప్పుడు రసవత్తరంగా నడుస్తుంది. హౌస్ లో ఉన్నవాళ్లలో ఎవరు బయటకు వెళ్తారు.? ఎవరు విజేత అవుతారని అందర్లోనూ ఉత్కంఠ మొదలైంది. ఇక ఈ షోను సెలబ్రెటీలు సైతం ఫాలో అవుతుంటారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ బిగ్ బాస్ పై విశ్లేషణ కూడా అందించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది. టాప్ 5 లో ఎవరు ఉండవచ్చు అన్నదానిపైనే పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

” చిన్న రామయ్య ఎన్టీఆర్ సీజన్ 1, నాని సీజన్ 2, నాగార్జున సీజన్ 3.. వీటన్నింటినీ చూశాం. ముగ్గురూ చాలా బాగా చేశారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వాళ్లని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రెటీలు, బాగా పాపులర్ అయిన వాళ్లని తీసుకువస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువ యూత్‌ని తీసుకువచ్చారు. షో చూస్తుంటే మనం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నామో వాళ్ళు వెళ్లడంలేదు. ఎవరు వెళ్లారు అని అనుకుంటామో వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. టీవీ 9 దేవి  ఉంటుందని అనుకున్నాం ఆమె కూడా వచ్చేసింది. అదేవిధంగా అమ్మా రాజశేఖర్ చివరి వరకూ ఉంటాడని అనుకున్నాం.. అతను కూడా ఎలిమినేట్ అయ్యాడు. దివి కూడా ఉంటుందనే అనుకున్నాం ఆమె కూడా బయటకు వచ్చేసింది.కుమార్ సాయి అయినా ఉంటాడనుకున్నాం కానీ అతడు కూడా బయటకు వచ్చేసాడు. ఇలా మంచి మంచి కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేట్ అయ్యారు. అఖిల్ వెళ్లిపోతున్నాడనే అనుకున్నారంతా అంతలా రక్తికట్టించగలిగాడు నాగార్జున. కాని అతడికి ఎకంగా 8 కోట్ల ఓట్లు పడ్డాయి. హౌస్ మేట్స్ కూడా అద్భుతంగా చేశారు ఆ ఎపిసోడ్‌లో.అరియానాకి తక్కువ ఓట్లు పడతాయని అనుకున్నా.. కానీ ఆమే ఫస్ట్ సేవ్ అవుతోంది. దీన్ని బట్టి ఇంటి సభ్యులు ఎవర్నైతే కార్నర్ చేస్తున్నారో వాళ్లకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా అభిజిత్, అరియానా‌లకు ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు టాప్‌ 5లో ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఏడ్చేసిన వాళ్లు.. సోమవారం నామినేషన్స్‌కి వచ్చేసరికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ప్రేక్షకులకు తెలియని చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చి మట్టిలో మాణిక్యాలను చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.” అంటూ బిగ్ బాస్ పై పరుచూరి ప్రశంసల వర్షం కురిపించారు.