Bigg Boss 4 : ఇంటిసభ్యులకు క్లాస్ తీసుకున్న నాగార్జున.. మళ్ళీ కుళాయి తిప్పిన మోనాల్

|

Dec 05, 2020 | 7:17 PM

బిగ్ బాస్4 చివరి అంకానికి చేరుకుంది. టికేట్ టూ ఫినాలే లో బాగంగా ఇంటి సభ్యుల మద్య వార్ జరిగింది.నేడు శనివారం కావడంతో ఎప్పటిలానే నాగార్జున ఈ వారం హౌస్ లో జరిగిన రచ్చ పై చర్చ పెట్టారు.

Bigg Boss 4 : ఇంటిసభ్యులకు క్లాస్ తీసుకున్న నాగార్జున.. మళ్ళీ కుళాయి తిప్పిన మోనాల్
Follow us on

బిగ్ బాస్4 చివరి అంకానికి చేరుకుంది. టికేట్ టూ ఫినాలే లో బాగంగా ఇంటి సభ్యుల మద్య వార్ జరిగింది. నేడు శనివారం కావడంతో ఎప్పటిలానే నాగార్జున ఈ వారం హౌస్ లో జరిగిన రచ్చ పై చర్చ పెట్టారు. టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఎందుకు గొడవపడ్డారో అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఇక గత వారం హౌస్ లో పెద్ద రచ్చే జరిగింది. టాస్క్ ఆడకుండా హౌస్ మేట్స్ ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా మోనాల్, అవినాష్ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది.

టాస్క్ లో భాగంగా హౌస్ లో ఆవు బొమ్మను ఉంచి దానినుంచి వచ్చిన పాలను తమ బాటిల్స్ లో నింపుకోవాలని, చివరకు ఎవరిదగ్గర ఎక్కువ బాటిల్స్  ఉంటే వారే రెండో రౌండ్ కు అర్హులు అవుతారని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో పాలను పట్టుకునే క్రమంలో ఇంటిసభ్యులు కిందామీదా పడ్డారు. ఈ టాస్క్ లో ముందుగా అవినాష్ అవుట్ అయ్యాడు. పాలు పట్టుకునే క్రమంలో మోనాల్ తనను కాలితో తన్నిందని గొడవ పెట్టుకున్నాడు అవినాష్. ఇంట్లో అమ్మాయిలు ఏం చేసినా అది కరెక్ట్.. నేను ఏం చేసిన అది తప్పు అంటున్నారంటూ సీరియస్ అయ్యాడు. అయితే మోనాల్ మాత్రం తాను కావాలని చేయలేదని, పొరపాటున తగిలిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మోనాల్ నిన్ను కావాలనే తన్నిందా అని నాగార్జున అవినాష్ ను అడిగితే..కావాలనే తన్నింది అని సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తన వైపు గర్వంగా నవ్వుతూ ఒక చూపు చూసిందని, అది ఇంకా బాధ అనిపించిందని చెప్పాడు. అరియనా కూడా మోనాల్ నవ్వుతూ ఎదో కమ్యూనికేట్ చేసిందని చెప్పింది. దాంతో అవినాష్-మోనాల్ లో తప్పు ఎవరిదన్నది మరోసారి వీడియోను చూపించి మరీ నాగార్జున తేల్చనున్నారు.