Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఈ సారి టైటిల్‌ని గెలిచి లేడి బిగ్‌బాస్‌గా నిలుస్తానంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన నాగవల్లి.. మూడో వారం ఎలిమినేట్ అయ్యింది. మొదటి నుంచి హౌజ్‌లోని అందరికీ గట్టి పోటీ ఇస్తూ వచ్చిన దేవి, అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడంతో.. అటు మిగిలిన కంటెస్టెంట్‌లు, ఇటు వీక్షకులు షాక్‌కి గురయ్యారు. ఇక హౌజ్‌లో నుంచి బయటకు వచ్చిన దేవి మిగిలిన కంటెస్టెంట్‌లు అందరి గురించి పాజిటివ్‌గా చెప్పడం అందరినీ భావోద్వేగానికి గురి అయ్యేలా చేసింది.
కాగా దేవి వెళ్లే సమయంలో ఆమెకు పాజిటివ్ బిగ్‌బాస్ బాంబ్ రావడంతో దాన్ని అరియానాకు ఇచ్చారు దేవి. దీంతో అరియానా వచ్చే వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అవ్వకుండా దేవి సేవ్ చేశారు. అయితే గత వారం ఓ ఎపిసోడ్‌లో తాను ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే బాధ్యతను తీసుకోవాలని దేవి, అరియానాకు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు దేవి ఎలమినేట్ అయ్యే సమయంలో అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్కా అంటూ బోరున ఏడ్చింది.
Read More: