Bigg Boss 4: బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. అభి, అమ్మ మధ్య బిగ్‌ ఫైట్‌

| Edited By:

Oct 24, 2020 | 7:25 AM

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బ్లాక్‌బస్టర్‌ సినిమా చేయండని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ క్రమంలో అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, దివి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌& నటుడు

Bigg Boss 4: బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. అభి, అమ్మ మధ్య బిగ్‌ ఫైట్‌
Follow us on

Bigg Boss 4 Telugu: శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బ్లాక్‌బస్టర్‌ సినిమా చేయండని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ క్రమంలో అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, దివి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌& నటుడు, నోయ‌ల్ డీఓపీగా, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా, లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్ట్‌గా, హారిక‌, సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా ఎంపిక అయ్యారు. ఇక మిగిలిన వారు ఇచ్చిన పాత్రలకు తగ్గట్లుగా నటించాలి. ఇక స్క్రిప్ట్‌ రైటర్ ఇచ్చిన స్క్రిప్ట్‌ తరువాతే డైరక్టర్‌తో కలిసి వారి పాత్రలకు అనుగుణంగా సభ్యులను ఎంపిక చేయాలని.. ఈ మూవీలో అన్ని ఎమోషన్లు ఉండాలని బిగ్‌బాస్ కండిషన్ పెట్టారు. ఇక షూటింగ్‌కి అవసరమైన పరికరాలన్నింటిని గార్డెన్‌ ఏరియాలో పెట్టారు.

దీంతో అభిజీత్, దివి, అవినాష్, నోయల్ కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ అక్కడికి వెళ్లారు. వారి మధ్య ఐటమ్ సాంగ్ గురించి చర్చ జరిగింది. ఐటమ్‌ సాంగ్‌కి కావాల్సిన లొకేషన్ బిగ్‌బాస్‌ ఇస్తారని అభి చెప్పగా.. కొరియోగ్రాఫర్‌ని నాకు నచ్చినట్టు చేసుకుంటా, వాళ్లు ఎవరు ఇవ్వడానికి అని అమ్మ రాజశేఖర్ మాస్టర్ గట్టిగా అన్నారు. అయితే లొకేషన్ వాళ్లే ఇస్తారని నిబంధనల్లో ఉందని.. దివి, రాజశేఖర్‌ మాస్టర్‌కి అర్థమయ్యేలా చెప్పారు.

ఇక పాట చేసేటప్పుడు డాన్సర్లు, డీఓపీ మాత్రమే కొరియోగ్రాఫర్‌తో ఉండాలని.. దర్శకుడు రావాల్సిన అవసరం లేదని నిబంధనల్లో ఉందని అమ్మ రాజశేఖర్ అన్నారు. అలాగే రిక్షా కూడా పాటకు అవసరం లేదని, ఏదైనా సీన్‌కి వాడుకోమని రాజశేఖర్ అన్నాడు. వెంటనే అభి..‘‘ఇప్పుడేంటి డైరెక్టర్ రావద్దు అంటున్నారు అంతేగా’’ అని అడిగాడు. దానికి మాస్టర్‌ నేనేమీ అనలేదు. నిబంధనల్లో ఉంది అన్నారు. దానికి ఆ ఉంది నాకు తెలుసు అని అభి సమాధానం ఇచ్చాడు. దీంతో రాజశేఖర్‌ మాస్టర్‌కి బాగా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు. నేను ఒకటి మాట్లాడుతుంటే, నువ్వు మరొకటి మాట్లాడుతున్నావు. ఉదయం నుంచి చూస్తున్నా. ఓవర్‌ సీన్ చూపిస్తున్నావు అని మండిపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది.

ఆ తరువాత సినిమా కోసం జరిగిన డిస్కషన్లలో చిరాకులు, పరాకులు కనిపించాయి. ఇక హారిక, సొహైల్‌లకు కెవ్వు కేక పాటకు కొరియోగ్రఫీ చేశారు మాస్టర్. హారిక మాస్ స్టెప్పులతో దుమ్ము లేపింది. ఇలా బ్లాక్‌బస్టర్‌ మూవీ మొత్తానికి పూర్తి చేశారు. ఈ మూవీని ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూపించనున్నారు.

Read More:

గీతం వర్శిటీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ఎర్రగడ్డ రైతు బజార్‌లో రాయితీ ఉల్లిగడ్డ విక్రయాలు