ఎర్రగడ్డ రైతు బజార్‌లో రాయితీ ఉల్లిగడ్డ విక్రయాలు

సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతీరోజూ వంటలోకి అవసరమయ్యే ఉల్లి ధర ఇప్పుడు భగ్గుమంటోంది. దీనికి తోడు బతుకమ్మ, దసరా పండుగ సీజన్ కావడంతో పెరిగిన ఉల్లి ధరకు కొనడం పేదప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కారు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి ఎర్రగడ్డ రైతు బజార్‌లో రాయితీ ధరతో ఉల్లిగడ్డ విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఉ.11 గంటల నుంచి రాయితీ ఉల్లిగడ్డ అమ్మకాలు […]

  • Venkata Narayana
  • Publish Date - 6:55 am, Sat, 24 October 20

సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతీరోజూ వంటలోకి అవసరమయ్యే ఉల్లి ధర ఇప్పుడు భగ్గుమంటోంది. దీనికి తోడు బతుకమ్మ, దసరా పండుగ సీజన్ కావడంతో పెరిగిన ఉల్లి ధరకు కొనడం పేదప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కారు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి ఎర్రగడ్డ రైతు బజార్‌లో రాయితీ ధరతో ఉల్లిగడ్డ విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఉ.11 గంటల నుంచి రాయితీ ఉల్లిగడ్డ అమ్మకాలు చేపడతారు. కిలో ఉల్లిగడ్డ రూ.40కి విక్రయించనున్నట్టు అధికారుల టీవీ9 కు తెలిపారు.