Bigg Boss 4: కిరికిరి చేసిన అభిజిత్‌.. ఏడ్చేసిన హారిక

బుధవారం ఎపిసోడ్‌లో మొదలైన హోటల్ టాస్క్‌ గురువారం కొనసాగింది. గెస్ట్‌లను మెప్పించి వాళ్ల దగ్గర నుంచి స్టార్స్ తీసుకోవాలని క్లియర్‌గా రాస్తే, అభి మాత్రం హారికను బుట్టలో పడేసి ఐదు స్టార్లు కొట్టేశాడు

Bigg Boss 4: కిరికిరి చేసిన అభిజిత్‌.. ఏడ్చేసిన హారిక
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 09, 2020 | 7:07 AM

Bigg Boss 4 Telugu: బుధవారం ఎపిసోడ్‌లో మొదలైన హోటల్ టాస్క్‌ గురువారం కొనసాగింది. గెస్ట్‌లను మెప్పించి వాళ్ల దగ్గర నుంచి స్టార్స్ తీసుకోవాలని క్లియర్‌గా రాస్తే, అభి మాత్రం హారికను బుట్టలో పడేసి ఐదు స్టార్లు కొట్టేశాడు. అంతేకాదు గెస్ట్‌లు ఇష్టపూర్వకంగా పెట్టాల్సిన అవసరం లేదంటూ వాదించాడు. మధ్యలో లాస్య గెస్ట్‌లతో స్టార్స్ ఇప్పించుకోవాలని చెప్పగా.. బిగ్‌బాస్ అలా అనలేదు అంటూ మొండిపట్టు పట్టాడు. అయితే సుజాత, అభిజిత్‌కి సపోర్ట్ చేసింది. గెస్ట్ టీంలో ఉన్న హారికే కదా ఇచ్చింది మనం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సుజాత, అభికి మద్దతు ఇచ్చింది.

ఇర అవినాష్ పాటలతో సందడి సందడి చేస్తుండగానే టాస్క్ ముగిసినట్టు బిగ్‌బాస్ తెలిపారు. ఈ సందర్భంగా హోటల్ టీం, గెస్ట్ టీంల ద్వారా ఎన్ని పాయింట్స్ పొందారో చెప్పాలని బాగ్‌బాస్ అడిగాడు. దానికి అభిజిత్ ఫైవ్ స్టార్ట్స్ అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే మేం ఇవ్వలేదు బిగ్‌బాస్ అని గెస్ట్‌ టీం వాదించారు. ఇక  మీ ఇష్టప్రకారం హోటల్ టీంకి ఎన్ని స్టార్స్ ఇచ్చారో చెప్పాలని కోరడంతో, నేను ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చా అని హారిక చెప్పింది. అయితే నేను బలవంతం చేయకుండానే హారిక ఫైవ్ స్టార్స్ ఇచ్చిందని, తన దృష్టిలో ఇష్టప్రకారం ఆమె ఐదు స్టార్లు ఇచ్చినట్లు అని బిగ్‌బాస్‌తో వాదించాడు.

ఇక ఈ విషయంలో అభి గట్టిగా కూర్చోగా.. హోటల్‌ టీమ్‌కి బిగ్‌బాస్‌ ఝలక్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్‌లో గెస్ట్‌ టీంనే విజేతగా ప్రకటించారు బిగ్‌బాస్‌. దీంతో చప్పట్లు కొట్టి ఏడుపు ముఖం పెట్టేశాడు అభి. కాగా ఇది జరగక ముందు అభిజిత్‌, ఐదు స్టార్‌లను తీసుకోవడంపై నోయెల్‌ దగ్గర ఏడ్చేసింది హారిక. అభి తనను బోల్తా కొట్టించి, తన చేతుల్లోని స్టార్స్ తీసుకున్నాడని, ఒకవేళ బిగ్‌బాస్ జడ్జిమెంట్ ఇదే అయితే హోటల్ టీంలో ఉన్నవాళ్లకి తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ హారిక భోరున ఏడ్చేసింది.

Read More:

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అంతా సిద్ధం..

హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం