Bigg Boss 4: అభిజిత్- హారిక రొమాన్స్.. ఒంటరిగా ఏడ్చేసిన అఖిల్
బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా అభిజిత్ తన దగ్గర ఉన్న స్టార్లను లాక్కున్నాడంటూ తెగ ఏడ్చేసిన హారిక.. ఆ టాస్క్ విజేతను ప్రకటించగానే మళ్లీ మామూలు అయ్యింది.
Abhijeet Harika romance : బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా అభిజిత్ తన దగ్గర ఉన్న స్టార్లను లాక్కున్నాడంటూ తెగ ఏడ్చేసిన హారిక.. ఆ టాస్క్ విజేతను ప్రకటించగానే మళ్లీ మామూలు అయ్యింది. ఈ సమయంలో అభిజిత్ వెళ్లి హారికను గట్టిగా కౌగలించుకున్నారు. ఒకరిని ఒకరు బాగా ఆడావంటూ అభినందించుకున్నారు. అప్పటివరకూ హారిక వద్ద ట్రిక్ ప్లే చేసి ఫైవ్ స్టార్‌లను తీసుకున్న అభి, నువ్వు కెప్టెన్ అవుతావు అంటూ ఎప్పటిలాగే పులిహోర కలిపాడు. కాగా వీరిద్దరు చాలాసేపు అలానే కౌగలించుకోగా.. ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు.
ఇదిలా ఉంటే మరోవైపు అఖిల్‌కి సుజాత అన్నం తినిపించింది. వీళ్లిద్దరి మధ్య ఇంతవరకు ఎప్పుడూ ఇంత సాన్నిహిత్యం కనిపించలేదు. ఇక కెప్టెన్సీ కోసం మంచు- నిప్పు.. మధ్యలో ఓర్పు అనే టాస్క్‌ని బిగ్‌బాస్ చెప్పాడు. చాలా టఫ్‌గా ఈ గేమ్‌ని డిజైన్ చేశారు. రెండు చేతుల్లో ఐస్ పెట్టుకోవాలి. కింద మంట ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు అలా పెట్టుకుంటారో వారికి కెప్టెన్‌గా ఎన్నికవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్‌లో అఖిల్, సొహైల్, అవినాష్ పాల్గొనగా.. అభిజిత్ సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అఖిల్‌కు అభి ఆల్ ద బెస్ట్ చెప్పడం విశేషం. ముందుగా అఖిల్ తన ఆటను ఆడలేక కిందపడ్డాడు. చివరకు సోహైల్ చాలా సేపు నిలవగా.. అతడు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టాస్క్ తరువాత మోనాల్ మళ్లీ మొదలుపెట్టింది. ”నేనేం చేశా. నాతో ఎందుకు మాట్లాడటం లేదు” అని అఖిల్‌ని అడిగింది. దానికి అఖిల్ ఏం మాట్లాడకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎందుకో గానీ అఖిల్ ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చూడబోతే మోనాల్‌తో మాట్లాడకూడదని అఖిల్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్టు అనిపించింది. అఖిల్ బాధను పసిగట్టిన గంగవ్వ ఏమైందంటూ వెళ్లి అరుచుకుంది.
Read More: