Bigg Boss 4: మోనాల్‌ కోసం ముందుకొచ్చిన అరియానా

| Edited By:

Oct 18, 2020 | 8:12 AM

బిగ్‌బాస్‌ 4 వారాంతం ఎపిసోడ్‌ బాగానే ఆకట్టుకుంది. పలువురు కంటెస్టెంట్‌లకు క్లాస్ పీకిన నాగార్జున కొందరికి సలహాలు కూడా ఇచ్చారు

Bigg Boss 4: మోనాల్‌ కోసం ముందుకొచ్చిన అరియానా
Follow us on

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4 వారాంతం ఎపిసోడ్‌ బాగానే ఆకట్టుకుంది. పలువురు కంటెస్టెంట్‌లకు క్లాస్ పీకిన నాగార్జున కొందరికి సలహాలు కూడా ఇచ్చారు. నోయ‌ల్‌ను రేస‌ర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఎందుకు ఆడ‌లేద‌ని నాగార్జున ప్ర‌శ్నించారు. అవ‌కాశ‌ం వచ్చిన‌ప్పుడు వ‌దులుకోవ‌ద్ద‌ని ఈ సందర్భంగా సూచించారు. నిజ‌మైన నోయ‌ల్ ఇంకా బ‌య‌ట‌కు రావ‌ట్లేద‌ని తెలిపారు. ఇక‌ సోహైల్ కోపాన్ని గెలిచాడని ప్రశంసలు కురిపించారు. ఈ వారం ఎపిసోడ్‌లో పలుచోట్ల కోపం వచ్చినప్పటికీ.. సొహైల్‌ తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. ఈ క్రమంలో అతడిని పొగిడారు.

ఇక సొహైల్‌ని పొగ‌రు అన్న అరియానాను నాగార్జున నిలదీశారు. సొహైల్‌ వచ్చి తినిపిస్తు మరీ సారీ చెప్పాడు కదా.. మరి నువ్వు చెప్పవా అని అరియానాను ప్రశ్నించాడు. దీంతో చెప్ప‌న‌ని మొండికేస్తూనే చివ‌రి నిమిషంలో అరియానా సారీ చెప్పింది. త‌ర్వాత బిగ్‌బాస్ డీల్స్ టాస్క్‌లో సోహైల్‌- అవినాష్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో అవినాష్‌దే త‌ప్ప‌ని నాగార్జున స్పష్టం చేశారు. సంచాల‌కుడిగా సోహైల్ క‌రెక్ట్‌గానే ఉన్నాడ‌ని ఆయన పేర్కొన్నారు. ఇక‌ మోనాల్ ఆరు రోజులుగా ఒక‌టే డ్రెస్ వేసుకుండ‌టంతో నాగార్జున ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఈ ఒక్క‌రోజు మోనాల్‌కు బ‌దులుగా.. ఆమె బ్లూ టీమ్‌లో ఉన్న వారు ఆ డ్రెస్ వేసుకోవాలని అన్నారు. దీంతో అరియానా ముందుకు వచ్చింది.

Read More:

Bigg Boss 4: ఎలిమినేషన్ స్టార్ట్‌.. ఆ ముగ్గురు సేఫ్‌

Bigg Boss 4: మాస్టర్ అరగుండు.. ఆకాశానికెత్తేసిన నాగార్జున