Breaking News
  • విజయవాడ : దివ్య సోదరుడు, దినేష్. మాకు సీఎం జగన్ ను కలిసే అవకాశం కావాలి. నా చెల్లికి తక్షణ న్యాయం జరగాలి. ఇది సామాజిక దారుణం. ప్రతీ రెండు రోజులకు ఇలాంటివి జరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా సేఫ్టీ లేకపోవడం సీరియస్ గా తీసుకోవాలి. దివ్య తండ్రి, జోసెఫ్: హోంమంత్రి రావడం మాకు భరోసాగా ఉంది. సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించారు. కోర్టుల చుట్టూ తిరగలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. తక్షణ నిర్ణయం వస్తుందని మాకు హోంమంత్రి నాకు భరోసా ఇచ్చారు. మాకు చాలా ధైర్యం ఇచ్చారు.
  • విజయవాడ: హోంమంత్రి సుచరిత: తండ్రి డ్రైవర్ వృత్తి చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా 13 కత్తిపోట్లు పొడవడం అనేది దారుణం. ఎవరూ ఆత్మహత్యకు 13 కత్తిపోట పొడుచుకోరు. ఇంత ఘాతుకానికి పాల్పడటం దారుణం. చిన్నారిని వేధించడం, హత్య చేయడం దారుణం. మహిళలకు చట్టాల పట్ల అవగాహన ఉండాలి. బాధ కలిగినపుడు ఆడపిల్లలు తలిదండ్రులకు తెలియజేయాలి. తలిదండ్రులు కూడా పిల్లలకు అండగా ఉండాలి. ఏదైనా వేధింపులు తెలిస్తే, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. దిశ అమలులోకి తెచ్చాక, అత్యాచారం హత్య చేసిన వ్యక్తికి ఉరి శిక్ష విధించాం. ఐపీసీ 302, 304 సెక్షన్ల క్రింద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసాం. సీఎం జగన్ ఈ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ ఆడపిల్లా డయల్ 100, పోలీసు సేవలు తెలుసుకోవాలి. దిశకు పదమూడు న్యాయస్ధానాలు ఉన్నాయి. దిశ చట్టానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 354 E,G,F సెక్షన్లు అమెండ్ చేసాం. దిశలో కొన్ని మార్పులు చేయమని కేంద్రం సూచించింది.
  • హైదరాబాద్ జూ పార్క్ లో భారీ దత్తత. హైదరాబాద్ జూ పార్క్ లో వన్యప్రాణులను దత్తతు తీసుకున్న గ్లాండ్ ఫార్మా లిమిటెడ్. 27 వన్యప్రాణులను దత్తతు తీసుకున్న గ్లాండ్ ఫార్మా లిమిటెడ్. ఒక సంవత్సరం పోషణకు గాను దత్తత. కంపెనీ csr కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయల చెక్కును జూ అధికారులకు అందజేసిన గ్లాండ్ ఫార్మా ప్రతినిధులు. గ్లాండ్ ఫార్మా కు కృతజ్ఞతలు తెలిపిన జూ డిప్యూటీ క్యురేటర్ నాగమణి. కరోనా మహమ్మారి కాలంలో ఆర్థికంగా నష్టపోయాం- నాగమణి. ఈ సహాయం ఎంతో ఉపయోగ పడుతుంది - నాగమణి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలి - నాగమణి.
  • రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద ఉన్న అప్ప చెరువు ని పరిశీలించిన మంత్రి కేటీఆర్. మొన్నటి భారీ వర్షాలకు అప్ప చెరువు తెగి పెద్ద ఎత్తున జనావాసాల వరదకు కారణమై న అప్ప చెరువు. సాగునీటి శాఖ తో సమన్వయం చేసుకొని వెంటనే చెరువుకట్ట కు తగిన మరమ్మతులు చేయాలని సూచించిన మంత్రి. చెరువు లో వెలసిన ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారుల కి ఆదేశం.
  • మిథున్‌ చక్రవర్తి భార్య యోగితా బాలీ, కొడుకు మహాక్షయ్‌ చక్రవర్తి మీద రేప్‌ కేసు. తనను రేప్‌ చేయటంతో పాటు బలవంతంగా అబార్షన్ చేయించారంటూ ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చిన మోడల్‌. 2015 నుంచి 2018 వరకు తాను మహాక్షయ్ తో రిలేషన్‌లో ఉన్నట్టుగా చెప్పిన బాదితురాలు. తాము ఫిజికల్ రిలేషన్‌లో కూడా ఉన్నట్టుగా చెప్పిన బాధితురాలు. బలవంతంగా అబార్షన్ చేయించారంటూ ఆరోపణ.
  • విశాఖ: పోలీస్ కస్టడీకి నూతన్ నాయుడు . చీటింగ్ కేసులో నూతన్ నాయుడును కస్టడీకి తీసుకున్న ఎమ్మార్ పేట పోలీసులు. దళిత యువకుడికి ఉద్యోగమిప్పిస్తానని మోసం చేసినట్టు అభియోగం.. మహారాణిపేట పీఎస్ లో కేసు. విచారించి జ్యుడీషియల్ కస్టడీకి నూతన్ నాయుడు ను అప్పగించిన పోలీసులు.
  • Tv9 తో మంత్రి శ్రీనివాస్ గౌడ్: టీవీ9 స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీవీ9 సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది. పోలీసులే కాదు మీడియా సంస్థలు కూడా ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా చేయాలి. టీవీ9 అందించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాం. చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయడానికి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తా. హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఎంత వారైనా, ఎంత పలుకుబడి ఉన్న శిక్ష తప్పదు. కొంత మంది ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సైబర్ క్రైమ్ సహకారంతో వారి ఆట కట్టిస్తున్నాం. తెలంగాణ వచ్చాక పేకాట క్లబ్ ల నుంచి గంజాయి వరకు అన్ని బందు చేశాం. దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Bigg Boss 4: ఎలిమినేషన్ స్టార్ట్‌.. ఆ ముగ్గురు సేఫ్‌

ఆరోవారం ఎలిమినేషన్‌కిగానూ మొత్తం 9 మంది నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. వారిలో మొదటగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున.

Bigg Boss 4 elimination, Bigg Boss 4: ఎలిమినేషన్ స్టార్ట్‌.. ఆ ముగ్గురు సేఫ్‌

Bigg Boss 4 elimination: ఆరోవారం ఎలిమినేషన్‌కిగానూ మొత్తం 9 మంది నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. వారిలో మొదటగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున. ఎండుమిర్చి, పచ్చిమిర్చి బ్యాగ్‌లు ఇచ్చి వాటిలో పచ్చి మిర్చీలు వచ్చినవాళ్లు సేవ్ అవుతారని నాగార్జున చెప్పారు. దీంతో పచ్చి మిర్చిలు వచ్చిన లాస్య సేవ్ అయ్యింది. ఆ తరువాత రెండో కంటెస్టెంట్‌గా నోయల్ సేవ్ అయ్యాడు. ఈ సందర్భంగా నోయల్‌కి మరో ఆఫర్ ఇచ్చారు నాగార్జున. నీకు ఎవరినైనా సేవ్ చేసే అధికారం ఇస్తే ఎవర్ని కాపాడతావు అని అడిగారు. దీంతో హారిక పేరు చెప్పాడు నోయల్‌.

ఆ తరువాత నోయల్‌ని స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి ఓ కాయిన్‌ని తీసుకురావాలని, ఆ కాయిన్‌పై ఎవరి బొమ్మ ఉంటుందో వాళ్లు సేవ్ అయినట్టు అని నాగార్జున చెప్పారు. నోయల్‌ స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి కాయిన్ తీసుకువచ్చాడు. దానిపై హారిక ఫొటో ఉండటంతో ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమె సేవ్ అయ్యింది. మొత్తంగా ఆరోవారం నామినేషన్స్‌లో ఉన్న తొమ్మది మందిలో నోయల్, హారిక, లాస్య‌లు సేవ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అయితే అరగుండు కొట్టించుకున్నందుకు మీరు సెల్ఫ్‌ సేవ్ అవుతారా..? లేక ఎవరినైనా సేవ్ చేస్తారా..? అని నాగార్జున అడగ్గా.. నన్ను నేను సేవ్ చేసుకుంటా అని చెప్పారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్‌ని నుంచి మాస్టర్ సేవ్ అయ్యారు. అయితే ఈ వారం కుమార్‌ సాయి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

Bigg Boss 4: మాస్టర్ అరగుండు.. ఆకాశానికెత్తేసిన నాగార్జున

అర్ధరాత్రి తెగిన బాలాపూర్ గుర్రం చెరువు కట్ట.. నడుంలోతు మునిగిన కాలనీలు

Related Tags