Bigg Boss 4: మోనాల్‌కి మరో షాక్‌.. రూట్ మార్చిన ఆ ఇద్దరు

| Edited By:

Sep 30, 2020 | 7:54 AM

బిగ్‌బాస్‌ 4లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్‌కి ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్‌. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఈ ఇద్దరు మోనాల్‌పై ఇంట్రస్ట్ చూపుతూ వచ్చారు

Bigg Boss 4: మోనాల్‌కి మరో షాక్‌.. రూట్ మార్చిన ఆ ఇద్దరు
Follow us on

Shock to Monal: బిగ్‌బాస్‌ 4లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్‌కి ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్‌. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఈ ఇద్దరు మోనాల్‌పై ఇంట్రస్ట్ చూపుతూ వచ్చారు. అయితే అఖిల్‌, మోనాల్‌కి ఫిక్స్ అవ్వగా.. అభి, హారికను కూడా లైన్‌లో పెట్టారు. ఇక నిన్నటివారం స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తరువాత.. ఈ ఇద్దరు మళ్లీ ఆమెపైపు తిరిగారు. సోమవారం వరకు స్వాతి, అభి మధ్య లవ్‌ స్టోరీ నడవగా.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అఖిల్‌, స్వాతి మధ్య లవ్‌ స్టోరీ మొదలైంది.

మోనాల్‌తో ముచ్చట్లు పెట్టిన అఖిల్ ఆ తరువాత స్వాతి దీక్షిత్ పాట అందుకుంటే దానికి శృతి కలిపాడు. ఇంత అందంగా ఎలా ఉండగలగుతున్నారు. నేనూ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ పులిహోర స్టార్ట్ చేశాడు. వీరిద్దరు మాట్లాడుకుంటోన్న సమయంలో స్వాతి కనురెప్ప వెంట్రుక కింద పడగా.. దాన్ని తీసి ఇచ్చాడు అఖిల్‌. ఇక ఆ వెంట్రుకతో అఖిల్‌ మనసులో కోరిక తీరుతుందో లేదో చెప్తానని స్వాతి చెప్పింది. దాన్ని చేతిపై పెట్టుకొని గట్టిగా ఊదితే వెంట్రుక ఎగిరిపోతే మనసులో అనుకున్నది జరుగుతుందని, లేదంటే జరగదని చెప్పింది. ఆ తరువాత అఖిల్ మనసులో ఏం అనుకుంటే అది జరగాలి అనుకుంటూ గట్టిగా ఊదగా.. ఆ వెంట్రుక ఎగిరిపోయింది. దీంతో నువ్వు అనుకున్నది అవుతుందంటూ  స్వాతి చెప్పింది.

అయితే స్వాతి రాకతో మొత్తానికి మోనాల్‌కి షాక్ తగిలింది. అప్పుడు అభి, అఖిల్‌ ఆమె చుట్టూ తిరగ్గా.. ఇప్పుడు వారు మోనాల్‌ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే లాస్య, ఇంటి సభ్యులు అనుమానం పడినట్టుగా, స్వాతిని ఏదో అఫైర్ కోసమే ఇంటిలోకి పంపినట్లు వీక్షకులకు అర్థం అవుతుంది.

Read More:

Bigg Boss 4: మగాడిలా ఆట ఆడు.. అభిపై సొహైల్‌ సీరియస్‌

IPL 2020 : చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్..