Bigg Boss 4: మళ్లీ కలిసిపోయిన అభి-అఖిల్‌-మోనాల్‌

బిగ్‌బాస్‌ 4లో మొత్తానికి ఒక హైడ్రామాకు తెరపడింది. గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్‌-మోనాల్‌లు మళ్లీ కలిశారు.

Bigg Boss 4: మళ్లీ కలిసిపోయిన అభి-అఖిల్‌-మోనాల్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 31, 2020 | 7:18 AM

Abhijeet Akhil Monal: బిగ్‌బాస్‌ 4లో మొత్తానికి ఒక హైడ్రామాకు తెరపడింది. గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్‌-మోనాల్‌లు మళ్లీ కలిశారు. జరిగిన పరిస్థితులపై చర్చించుకున్నారు. నాకు ఐ లవ్‌ యు చెప్పి, ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావు. నాగార్జున సార్‌ ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావు అంటూ తన హర్ట్‌ అయిన విషయాన్ని గుర్తు చేశాడు అభి.

ఇక వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుండగా.. సీన్‌లోకి అఖిల్‌ ఎంటర్‌ అయ్యాడు. అభి.. నువ్వు ఇప్పుడు చెప్పినట్లు అప్పుడే చెప్పి ఉంటే మోనాల్‌ అర్థం చేసుకునేది. కానీ అప్పుడు నీ టోన్‌ డిఫరెంట్‌గా ఉంది. అందుకు ఆమె తప్పుగా అర్థం చేసుకుంది అని కూల్‌గా అభితో మోనాల్‌కి క్షమాపణ చెప్పించే ప్రయత్నం అఖిల్‌ చేశాడు. కానీ అభి మాత్రం వెనక్కి తగ్గలేదు. (IPL 2020: స్టోక్స్ మెరిసేన్.. రాయల్స్ మురిసేన్..)

మోనాల్‌కి తప్పుగా అర్థమైతే ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు. నా గురించి మాట్లాడుకునే హక్కు నాకు ఉంది. కానీ మోనాల్‌ వలన నేను హర్ట్ అయ్యా. నీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇద్దరం ప్రశాంతంగా ఉందాం. ఈ విషయం ఎక్కడికెక్కడితో వెళుతోంది. ఇక్కడితో ఇది క్లియర్ . ప్రశాంతంగా ఉందాం అని మోనాల్, అఖిల్ దగ్గర నుంచి అభి లేచి వెళ్లిపోయాడు. వెంటనే డన్.. డన్ అనుకుంటూ అఖిల్‌, మోనాల్‌ ఒకర్నొకరు చూసుకున్నారు. మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్‌కి ఇప్పుడు తెర పడినట్లైంది. ( వైష్ణోదేవి భక్తులకు శుభవార్త)