Bigg Boss 4: హాట్‌హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం

గత నాలుగు వారాలుగా నామినేషన్ ప్రక్రియ సాధారణంగానే జరిగినప్పటికీ, ఈ వారం మాత్రం హాట్ హాట్‌గా జరిగింది. రాజకీయాల్లో కూడా ఈ రేంజ్ హీట్ కనిపించదేమో అనిపించింది

Bigg Boss 4: హాట్‌హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 06, 2020 | 7:30 AM

Bigg Boss 4 Telugu: గత నాలుగు వారాలుగా నామినేషన్ ప్రక్రియ సాధారణంగానే జరిగినప్పటికీ, ఈ వారం మాత్రం హాట్ హాట్‌గా జరిగింది. రాజకీయాల్లో కూడా ఈ రేంజ్ హీట్ కనిపించదేమో అనిపించింది. ఇన్ని రోజులు కంటెస్టెంట్‌ల మధ్య ఉన్న కోల్డ్ వార్ కాస్తా బ్లాస్ట్ అయింది. ఈ సారి నామినేషన్‌లలో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై నురగను పూయాలని, అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా కారణాలు చెప్పాలని బిగ్‌బాస్‌ వెల్లడించారు. దీంతో అసలు ఆట మొదలైంది.

మొదటగా అఖిల్, అభిని నామినేట్ చేసి కారణం చెప్పాడు. ఒరేయ్ అని అనడానికి అభి పర్మిషన్ తీసుకున్నానని, అయినా దానిపై రాద్దాంతం చేశాడని, ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదని వాటివల్ల నేను హర్ట్ అయ్యానని ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదని అఖిల్ అన్నాడు. దీనిపై ఇద్దరి మధ్య రచ్చ రేగింది. నువ్వు ఒరేయ్ అనడం నాకు నచ్చలేదు. క్వాలిఫికేషన్ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదు అంటూ అభి వాదించడంతో ఇద్దర మధ్య చాలాసేపు రచ్చ సాగింది.  ఇక రెండో వ్యక్తిగా అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని అఖిల్‌ నామినేట్ చేశాడు.

ఆ తరువాత అరియానా గ్లోరీ రాజశేఖర్ మాస్టర్, అఖిల్‌లను నామినేట్ చేసింది. లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్ స్వార్థంగా ఆలోచించి.. తను అనుకున్న వాళ్ల కోసమే షాపింగ్ చేసి, మిగిలిన వాళ్లకి చేయలేదని అది తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే మాస్టర్‌ తనని హేళన చేస్తున్నారని, పనిచేయడం లేదని అంటున్నారని అందుకే ఆయనను నామినేట్ చేస్తున్నానని స్పష్టం చేసింది. దీంతో మాస్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఇక లాస్య.. దివి, నోయెల్‌ని నామినేట్ చేసింది. కిచెన్ టీంలో పాత్రలు కడగటానికి దివి రానని చెప్పిందని, అలాగే కుక్ చేసేటప్పుడు నీట్‌గా ఉండటం లేదని లాస్య చెప్పింది. ఇక నోయల్ తనను ఫేక్ అని నాగార్జున ముందే అనడం బాధ కలిగించిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది.

అనంతరం అవినాష్.. అఖిల్, మోనాల్‌‌ని నామినేట్ చేశాడు. లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్‌ కొంతమందికి మాత్రమే షాపింగ్ చేయడం నచ్చలేదని అందుకే నామినేట్ చేశానని అవినాష్ తెలిపాడు. హిట్ మ్యాన్ గేమ్‌లో మోనాల్‌ తనను సేఫ్ గేమ్ అడుతున్నాని అనడం నచ్చలేదని వివరించాడు.

ఇక సుజాత, అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. లగ్జరీ బడ్జెట్‌ విషయాన్నే  కారణంగానే చూపించింది. ఆ తరువాత అరియానాని నామినేట్ చేస్తూ ఏదో సిల్లీ రీజన్ చెప్పింది.

కుమార్ సాయి.. నోయల్‌, సుజాతను నామినేట్ చేశాడు. నోయెల్‌ ఫస్ట్ నామినేషన్ అప్పుడు చెప్పిన రీజన్‌నే మళ్లీ మళ్లీ చెప్తున్నారని అందుకే నచ్చలేదని కుమార్ సాయి చెప్పాడు. ఇక సుజాత ఒకరిపై డిపెండ్ అయ్యి ఆట ఆడుతుందని, నచ్చిన వాళ్ల విషయంలో సెల్ఫిష్‌గా అనిపిస్తోందని తెలిపాడు.

సొహైల్.. అభిజిత్‌, నోయెల్‌ని నామినేట్ చేశాడు. వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో అభిజిత్‌ ప్రవర్తన తనకు నచ్చలేదని, ఇక కాయిన్ టాస్క్ విషయంలో నోయెల్‌ సపోర్ట్ చేస్తాడని అనుకుంటే, అతనే వివాదానికి కారణం అయ్యాడని సొహైల్ చెప్పాడు.

మెహబూబ్.. సుజాత, లాస్యలను నామినేట్ చేశాడు. సుజాత వలనే కెప్టెన్ టాస్క్‌ నుంచి తప్పుకున్నానని మెహబూబ్ అన్నాడు.

గంగవ్వ.. నోయెల్‌, అభిజిత్‌ని నామినేట్ చేసింది. నోయెల్‌ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంటాడని, ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తాడని చెప్పింది. ఇక అభిజిత్‌ ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడని వివరించింది.

ఆ తరువాత రాజశేఖర్ మాస్టర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య కష్టపడినట్టుగా అరియానా కిచెన్‌లో కష్టపడటం లేదని అన్నాడు.

ఇక హారిక అఖిల్‌, మోనాల్‌లను నామినేట్ చేసింది. మొదట్లో అఖిల్‌తో బాగానే ఉండేదాన్ని అని, కానీ ఇప్పుడు అతని యాట్యిట్యూడ్‌, బిహేవియర్, ఎక్స్‌ప్రెషన్స్‌ తనకు నచ్చలేదని చెప్పింది. అతడితో మాట్లాడాలంటే మరో మనిషి(మోనాల్‌)ని దాటుకొని మాట్లాడాల్సి వస్తుందని పేర్కొంది.

దివి.. లాస్య, సొహైల్‌ని నామినేట్ చేసింది. లాస్య పప్పు చేయడం వలన అందరికీ మోషన్స్ అవుతున్నాయని, వద్దని చెప్పినా వినడం లేదని దివి చెప్పింది. దీంతో తాను పప్పు చేయడం వలనే మోషన్స్ అవుతున్నాయంటే తాను ఒప్పుకోనని లాస్య మండిపడింది. ఇక కాయిన్ టాస్క్ విషయంలో సొహైల్‌ తనని హర్ట్ చేశాడని, అతడి వలన దెబ్బ తగిలిందని, ఎంత మర్చిపోవాలన్నా తన వల్ల కావడం లేదని చెప్పింది.

మోనాల్.. హారిక, అవినాష్‌లను నామినేట్ చేసింది. అభితో ఇష్యూ ఉంటే అతడితో మాట్లాడతాననిచ ఆ విషయంలో హారిక ఇన్వాల్వ్ అవ్వడం తనకు నచ్చలేదని మోనాల్‌ చెప్పింది. ఇక అవినాష్ చేసేది కామెడీ అని అతడు అనుకుంటే సరిపోదని, కొన్ని సందర్భాల్లో తనకి నచ్చలేదని మోనాల్ వెల్లడించింది.

ఆ తరువాత అభిజిత్.. సొహైల్‌, అఖిల్‌ని నామినేట్ చేశాడు. అఖిల్‌ని నామినేట్ చేసే సమయంలో గట్టిగానే క్లాస్ పీకాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి దూషించుకునే వరకూ వెళ్లింది. మధ్యలో మోనాల్‌, హారికల మ్యాటర్ కూడా బయటకు రాగా.. ఇద్దరు రెచ్చిపోయారు.

చివరగా నోయెల్.. నామినేట్ చేసే సమయంలో ఇంటి సభ్యులకు హితోబోధ చేశాడు. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని, ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సరైనా కారణం ఉండాలని చెప్పాడు. వెంటనే రాజశేఖర్ మాస్టర్‌ని నోయెల్‌ ఎలిమినేట్ చేశాడు. స్వాతిని అకారణంగా మాస్టర్‌ నామినేట్ చేశారని, అతడి వలన ఒక మొక్క ఎదగ కుండానే వెళ్లిపోయిందని నోయెల్‌ చెప్పాడు. ఈ సందర్భంగా సొహైల్ కలగజేసుకొని స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు, మరి ఇప్పుడు స్వాతి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఇక  సొహైల్ కలగజేసుకోవడంతో హర్ట్ అయిన నోయల్, రెండోవ్యక్తిగా అతడిని నామినేట్ చేశాడు.

మొత్తానికి ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు.

Read More:

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే కీలకాంశాలు ఇవే..

వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా పాజిటివ్