Losliya father death: తమిళ బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి, శ్రీలంక న్యూస్ రీడర్ లొస్లియా తండ్రి మరియనేషన్ మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కన్నమూశారు. దీంతో లొస్లియా అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. (కర్నూల్ జిల్లాలో దారుణం.. నాటు బాంబు పేలి ఏడోతరగతి విద్యార్థి మృతి)
కాగా బిగ్‌బాస్ 3లో ఫ్రీజ్‌టాస్క్‌లో భాగంగా లొస్లియా కోసం ఆమె తండ్రి వచ్చారు. వృత్తి రీత్యా కెనడాలో ఉన్నప్పటికీ.. లొస్లియా కోసం వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా హౌజ్‌లో ఆమె ప్రవర్తన పట్ల అరిచాడు. దర్శకుడు చెరణ్ పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావని కుమార్తెకు చెప్పారు. హౌజ్‌లో బావుండి తమకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే అప్పడు హౌజ్‌లో కెవిన్, లొస్లియా రిలేషన్‌షిప్‌పై కూడా ఆయన సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో చివరగా మిమ్మల్ని గర్వపడేలా చేస్తానంటూ లొస్లియా ఆమె తండ్రికి మాటిచ్చారు. అప్పట్లో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకున్న లొస్లియా ప్రస్తుతం అర్జున్, హర్భజన్ సింగ్ నటిస్తోన్న ఫ్రెండ్‌షిప్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. (రిటైర్ అయ్యే సమయానికి బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడు.. గిలెస్పీ ప్రశంసలు)