రాహుల్-పున్నూ..సమ్‌థింగ్-సమ్‌థింగ్..వితిక ఏమంది?

| Edited By: Srinu

Nov 06, 2019 | 5:47 PM

బిగ్‌బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు లాఠీఛార్జీ చెయ్యాల్సి వచ్చిందంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో పునర్నవీ  కీ రోల్ పోషించింది. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో ఆడియెన్స్ ఈ కపుల్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ […]

రాహుల్-పున్నూ..సమ్‌థింగ్-సమ్‌థింగ్..వితిక ఏమంది?
Follow us on

బిగ్‌బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు లాఠీఛార్జీ చెయ్యాల్సి వచ్చిందంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో పునర్నవీ  కీ రోల్ పోషించింది. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో ఆడియెన్స్ ఈ కపుల్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. వారిద్దరి మధ్య లవ్, డేటింగ్, రొమాన్స్ ఉందంటూ రకరకాలుగా ఎవరికి వారే కథలు అల్లుకున్నారు. ఇదంతా బయటనుంచి టీవీలో చూసే వీక్షకుల ఒపినియన్. కానీ హౌజ్‌లో వారిపక్కనే మిగతా కంటెస్టెంట్స్ ఒపినియన్ ఏంటి..? వాళ్లు కూడా ఈ కపుల్ మధ్య సమ్‌థింగ్..సమ్‌థింగ్ ఉందని భావించారా?..ఈ డౌబ్ట్‌నే క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది టీవీ9.

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన అనంతరం విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ టీవీ9కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్యూలో రాహుల్‌తో..మిగతా కంటెస్టెంట్ల అనుభవాలను కూడా టీవీ ఫోన్‌లైన్ ద్వారా తెలుసుకుంది. రాహుల్ స్టార్టింగ్‌లో ఎలా ఉండేవాడు..ఈ జర్నీలో అతనిలో వచ్చిన ఛేంజెస్ ఏంటి..?..రాహుల్, పునర్నవిల రిలేషన్‌పై హౌజ్‌మేట్స్ ఒపినియన్ ఏంటి అనే విషయాలపై బిగ్ బాస్ ఫేమ్ వితికా షేరు చెప్పిన డిటేల్స్ ఈ దిగువ వీడియోలో..