బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

|

Oct 18, 2019 | 12:35 PM

బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి.. ఇలా ఇంటి సభ్యులందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఫైనల్‌కు ఎవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ టాస్క్‌లో అందరూ కూడా తమకు ఇచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలం కావడంతో బిగ్ బాస్ అందరిని నామినేట్ చేయడం […]

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Follow us on

బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి.. ఇలా ఇంటి సభ్యులందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఫైనల్‌కు ఎవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ టాస్క్‌లో అందరూ కూడా తమకు ఇచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలం కావడంతో బిగ్ బాస్ అందరిని నామినేట్ చేయడం జరిగింది.

ఈ వారం వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హౌస్‌లోకి వీక్ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఆమె పలుసార్లు నామినేట్ అయినా అదృష్టం కలిసొచ్చి అవరోధాలన్నింటి దాటుకుని చివరి వరకు చేరుకుంది. ఇక తాజాగా షో చివరి దశకు చేరుకోవడం.. పైగా కొద్దిరోజులుగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రేక్షకులు ఆమెను ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారు. అంతేకాక పలు అనధికారిక పోల్స్‌ను పరిశీలిస్తే.. వితిక ఓటింగ్‌లో చాలా దారుణంగా వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవిలతో కలిసి ఉండటం వల్ల తప్పించుకుంది గానీ ఇప్పుడు షో చివరికి చేరుకోవడంతో ఎలిమినేషన్ తప్పేలా కనిపించట్లేదు.

మరోవైపు ఈ వారం వితికను కాపాడే క్రమంలో వరుణ్ సందేశ్‌ కూడా గెలిచే అవకాశాలను చేజేతులా కోల్పోయాడని చెప్పొచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్‌కు ఈ వారం ఛాన్స్ ఉంటే వితికతో పాటు శివజ్యోతి కూడా ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.