హిందీ బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేర్ అఫ్ అడ్రెస్. తాజాగా పదమూడో సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మొదటి నుంచి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లకు టాస్క్ రూపంలో ఆడవారిని, మగవారిని ఒక బెడ్ షేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. దానితో తీవ్ర దుమారానికి తెర లేచింది. మహిళా సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా షోపై విమర్శలు గుప్పించడమే కాకుండా హోస్ట్ సల్మాన్ ఖాన్ ఇంటిని కూడా ముట్టడించారు. ఇప్పుడు తాజాగా మరో వివాదం బిగ్ బాస్ షోకు తలనొప్పిగా మారింది.
కండలవీరుడు సల్మాన్ ఖాన్ హౌస్‌లో ఉన్న మంచోళ్ళను పక్కన పెట్టి.. నకిలీ మెంటాలిటీ కలిగిన వారిని వెనకేసుకుని వస్తున్నాడని వాదన వినిపిస్తోంది. గతవారం ఎలిమినేషన్‌ను ఒకసారి పరిశీలిస్తే.. హౌస్ నుంచి దల్జీత్ కౌర్, కోయినా మిత్రాలు బయటికి వచ్చారు. అయితే ఇద్దరూ కూడా ఎలిమినేట్ కావడానికి గల కారణాలు మాత్రం కరెక్ట్‌గా కనిపించట్లేదు. దల్జీత్ హౌస్‌లో ఉన్నన్నీ రోజులు ఎవరితోనూ గొడవలు పడకుండా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను ఫెయిర్‌గా ఆడింది. మరోపక్క కోయినా మిత్రా కూడా మనసులో అనుకున్న మాటను బహిర్గతం చేస్తూ.. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరూ కూడా బిగ్ బాస్ నుంచి బయటికి రావాల్సిన వ్యక్తులు కాదని నెటిజన్ల అభిప్రాయం. అంతేకాకుండా ఇద్దరూ బయటికి వచ్చిన తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వూస్‌లో సల్మాన్‌ను ఏకిపడడేయడమే కాకుండా.. మంచోళ్ళకు దూరంగా ఉంటూ.. చెడ్డవాళ్లను కాపాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాక బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అన్నారు. హౌస్‌లో నకిలీలకే చోటు ఉందని.. సల్మాన్‌కు నచ్చినవారే అక్కడ ఉండగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.