హేమక్క సారీ చెప్పాల్సిందే.. భీష్మించుకు కూర్చున్న రాహుల్

అది బిగ్ బాస్‌హౌస్.. ఆ ఇంట్లో ఏమైనా జరగొచ్చు.. అక్కడ శాశ్వత మిత్రులంటూ.. శాశ్వత శత్రువులంటూ ఉండరు.. అందరిదీ ఒకటే పాలసీ.. శత్రువు శత్రువు.. మిత్రుడన్న సూత్రమే అక్కడ వర్కౌట్ అవుతుంది. హౌస్‌లో ఆమె అందరికీ అక్క..! హేమక్కా.. అంటూ అందరూ ఆప్యాయంగా పిలుస్తుంటే.. ఆమె కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయేది. కానీ.. వారి మధ్య ప్రేమ గంట.. గడువక ముందే గొడవకు దారి తీసింది. హేమకు శత్రువల లిస్ట్ ఎంతమంది..? ఆఫ్ట్రాల్ సగం చపాతీనే కదా అంటూ […]

హేమక్క సారీ చెప్పాల్సిందే.. భీష్మించుకు కూర్చున్న రాహుల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 26, 2019 | 6:09 PM

అది బిగ్ బాస్‌హౌస్.. ఆ ఇంట్లో ఏమైనా జరగొచ్చు.. అక్కడ శాశ్వత మిత్రులంటూ.. శాశ్వత శత్రువులంటూ ఉండరు.. అందరిదీ ఒకటే పాలసీ.. శత్రువు శత్రువు.. మిత్రుడన్న సూత్రమే అక్కడ వర్కౌట్ అవుతుంది.

హౌస్‌లో ఆమె అందరికీ అక్క..! హేమక్కా.. అంటూ అందరూ ఆప్యాయంగా పిలుస్తుంటే.. ఆమె కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయేది. కానీ.. వారి మధ్య ప్రేమ గంట.. గడువక ముందే గొడవకు దారి తీసింది. హేమకు శత్రువల లిస్ట్ ఎంతమంది..?

ఆఫ్ట్రాల్ సగం చపాతీనే కదా అంటూ సిల్లీగా తీసుకోకండి.. అది బిగ్‌బాస్ హౌజ్.. రేషన్ కావాలంటే పెద్ద పరేషాన్. పొట్ట నింపుకోవాలంటే.. నానా పాట్లు పడాలి. అందుకే.. సగం పంచాయతీ కోసం పెద్ద పంచాయితీయే నడిచింది. ఇంతకీ ఆ సగం చపాతీ దొంగెవరు..? దొంగ ఎవరో తెలిశాక.. ఇంటి సభ్యుల రియాక్షన్ ఏంటి..?

అసలు.. ఎవ్వరూ తగ్గట్లేదు.. రాహుల్-హేమల మధ్య జరిగిన రచ్చ.. ఇప్పటికీ కొనసాగుతోంది. సారీ చెప్పేందుకు హేమ ససేమిరా అంటే.. చెప్పే వరకూ ఊరుకునేది లేదని రాహుల్ బీష్మీంచుకు కూర్చున్నాడు. మరి వారిద్దరి నాన్‌స్టాప్ రచ్చకు ఫుల్‌స్టాప్ పడుతుందా..? మరి ఇద్దరూ కలుస్తారా..? లేక ఇలానే ఉంటారో..! తరువాత ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి.