బ్రేకింగ్: హౌస్‌ నుంచి కంటెస్టెంట్ గెంటివేత

| Edited By:

Aug 08, 2019 | 5:12 PM

వివాదాస్పద బుల్లితెర సంచలనం బిగ్‌‌బాస్ మూడో సీజన్ తెలుగు, తమిళంలో విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తుండగా.. తమిళ్‌లో అంతకుమించిన వివాదాలు కంటెస్టెంట్‌ల మధ్యన నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాట బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌ను అర్ధాంతరంగా బయటకు పంపేశారు నిర్వాహకులు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అమ్మాయిలను తాకడం కోసం తాను అప్పట్లో రష్‌గా ఉన్న బస్సులను ఎక్కేవాడిని అంటూ నటుడు శరవణన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. […]

బ్రేకింగ్: హౌస్‌ నుంచి కంటెస్టెంట్ గెంటివేత
Follow us on

వివాదాస్పద బుల్లితెర సంచలనం బిగ్‌‌బాస్ మూడో సీజన్ తెలుగు, తమిళంలో విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తుండగా.. తమిళ్‌లో అంతకుమించిన వివాదాలు కంటెస్టెంట్‌ల మధ్యన నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాట బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌ను అర్ధాంతరంగా బయటకు పంపేశారు నిర్వాహకులు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అమ్మాయిలను తాకడం కోసం తాను అప్పట్లో రష్‌గా ఉన్న బస్సులను ఎక్కేవాడిని అంటూ నటుడు శరవణన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యాఖ్యత కమల్ సహా అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఈ వివాదంపై గాయని చిన్మయి స్పందిస్తూ.. ‘‘ఒక వ్యక్తి అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుతుంటే అక్కడున్న వారందరూ నవ్వుతున్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. అమ్మాయిలను తక్కువ చేసే వారిని, వారిపై బలవంతం చేసే వారికి ఇదో పెద్ద జోక్’’ అంటూ ట్వీట్ చేశారు.

దీంతో సమస్య పెద్దది అవ్వడంతో శరవణన్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. అయితే అంతటితో ఆగకుండా మళ్లీ దర్శకుడు చేరన్‌ను కించపరిచేవిధంగా కామెంట్లు చేశాడు శరవణన్. ఈ వ్యాఖ్యలను కమల్ హాసన్ కూడా తప్పుపట్టారు. ఇక అతడి నోటి దురుసుకు విసిగిపోయిన నిర్వాహకులు శరవణన్‌పై వేటేశారు. ఎలిమినేషన్ డే రాకముందే అర్థాంతరంగా అతడిని బయటకు పంపారు.