AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదా టాస్క్ కాస్తా.. సీరియస్‌గా మారింది: అలీని కాలితో తన్నిన హిమజ..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమైనా జరగవచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలీదు.. ఎప్పుడు ఎవరు వైల్డ్‌గా మారతారో కూడా చెప్పలేం.. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారే.. రేపు శత్రువులు అవుతారు. తాజాగా.. బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌లో ఎవరికి వారే.. వారి మీద నెగిటీవ్ యాంగిల్‌ పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు హౌస్‌లో అదే జరిగింది.. అలీ.. హిమజలు.. కాస్త సైలెంట్‌గా ఉన్నవారే.. ఉన్నట్టుండి.. నిన్న జరిగిన టాస్క్‌లో ఇద్దరు గొడవపడ్డారు. ఆ సందర్భంలో హిమజ.. అలీని కాలితో తన్నుతుంది. దానికి […]

సరదా టాస్క్ కాస్తా.. సీరియస్‌గా మారింది: అలీని కాలితో తన్నిన హిమజ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 08, 2019 | 12:27 PM

Share

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమైనా జరగవచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలీదు.. ఎప్పుడు ఎవరు వైల్డ్‌గా మారతారో కూడా చెప్పలేం.. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారే.. రేపు శత్రువులు అవుతారు. తాజాగా.. బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌లో ఎవరికి వారే.. వారి మీద నెగిటీవ్ యాంగిల్‌ పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు హౌస్‌లో అదే జరిగింది.. అలీ.. హిమజలు.. కాస్త సైలెంట్‌గా ఉన్నవారే.. ఉన్నట్టుండి.. నిన్న జరిగిన టాస్క్‌లో ఇద్దరు గొడవపడ్డారు. ఆ సందర్భంలో హిమజ.. అలీని కాలితో తన్నుతుంది. దానికి అలీ.. పెద్దగా అరుస్తూ.. గొడవపడ్డాడు. హిమజ సర్థి చెప్పేందుకు ట్రై చేసిన అలీ వినిపించుకోలేదు.

బిగ్‌బాస్.. ఇచ్చిన టాస్క్ ప్రకారం.. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి.. కథనం ప్రకారం నిధిని కొట్టేయడానికి ప్లాన్ వేస్తారు. రాహుల్, వితికా, వరుణ్, రోహిణి, అలీ నిధిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. శివజ్యోతి, బాబా భాస్కర్ పోలీసులు, హిమజ లాయర్‌గా వ్యవహరిస్తూంటారు. అయితే.. ఈ సందర్భంలో.. నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు అడుగుతాడు. దీనికి హిమజ నిరాకరిస్తుంది. దీంతో.. హిమజ జేబులో చేయిపెట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాడు అలీ.. దాంతో హిమజ అతని ముఖంపై తన్నుతుంది. దీంతో.. కోపంతో ఊగిపోయిన అలీ.. ఆమెపై దాడికి యత్నిస్తాడు. దీంతో.. గొడవ పెద్దది అవుతుంది.

కాగా.. ఆ తర్వాత హిమజ నేనే తప్పు చేశాను.. అని అలీకి సారీ చెప్తుంది.. అలీ ఓప్పుకోకపోవడంతో.. అతని కాళ్లపై పడుతుంది. దీంతో.. అలీ.. జనాల సింపతీ కోసం ఇలా చేయకు అనడంతో.. హిమజ మళ్లీ హర్ట్ అయ్యి.. బాత్రూమ్‌కి వెళ్లి బోరున ఏడుస్తుంది. దీంతో తమన్నా ఎంట్రీ అయ్యి.. హిమజకు మద్దతుగా.. అలీతో గొడవకు దిగుతుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇద్దరూ.. ఇద్దరి తప్పుల గురించి చర్చించుకుంటూ.. సారీలు చెప్పుకుంటారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా