Big News Big Debate: థియేటర్ల కహానికి క్లైమాక్స్‌ ఎప్పుడు.? సినీ ఇండస్ట్రీ స్వయంకృతాపరాధమా?

|

Dec 29, 2021 | 9:31 PM

Big News Big Debate: OTT సీరిస్‌లా సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పంచాయితీ బెజవాడకు మారింది. హీరోల కామెంట్లు.. వాటికి YCP నుంచి పంచ్‌లతో రచ్చ రచ్చగా

Big News Big Debate: థియేటర్ల కహానికి క్లైమాక్స్‌ ఎప్పుడు.? సినీ ఇండస్ట్రీ స్వయంకృతాపరాధమా?
Follow us on

Big News Big Debate: OTT సీరిస్‌లా సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పంచాయితీ బెజవాడకు మారింది. హీరోల కామెంట్లు.. వాటికి YCP నుంచి పంచ్‌లతో రచ్చ రచ్చగా మారిన కథలోకి దిల్‌ రాజు ఎంట్రీ ఇచ్చి డైలాగ్‌ వార్‌కు తెరవేశారు. అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా మంత్రి పేర్నితో సమావేశమై రణం వద్దు మాపై శరణు చూపండి అంటూ క్లారిటీ ఇచ్చారు. తుది పరిష్కారం కోసం ఇరువర్గాల నుంచి కమిటీలు వేశారు. మరి వాటి ద్వారా అయినా పరిష్కారం లభిస్తుందా.?

శరణమా. రణమా అంటే శరణమే అంటోంది తెలుగు సినిమా పరిశ్రమ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తలపడే పరిస్థితి లేదని చర్చలతోనే పరిష్కారం చేసుకుంటామంటోంది. హిట్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు పెరగడం లేదు. థియేటర్లు మూతపడుతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పండగ సీజన్‌లో నాలుగు డబ్బులు చేసుకోవాల్సిన సమయంలో వచ్చిన వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. ప్రభుత్వంతో చర్చల కోసం 17 మందితో ఫిలిం ఛాంబర్‌ కమిటీ కూడా వేసింది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లున్నారు. ఎమోషన్‌లో మాట్లాడిన మాటలు తప్పుగా కమ్యూనికేట్‌ అవడంతోనే సమస్య వచ్చిందంటున్నారు దిల్‌రాజు. త్వరలో సీఎం, మంత్రులను కలుస్తామన్నారు.

అటు విజయవాడలో మంత్రి పేర్నినాని ముందు సినిమా కష్టాలు చెప్పుకొచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు వర్కవుట్‌ కాదని.. పెంచుతూ కొత్తగా జీవో ఇస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్లు. అయితే సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం కమిటీని నియమించిందని.. త్వరలో నిర్ధారిస్తుందని ప్రకటించారు మంత్రి నాని. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రజా సంఘాలు ఇచ్చే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని మరీ ధరలు నిర్ణయిస్తామంటూ మెలిక పెట్టింది సర్కార్‌.

3 నెలలు గడువు ఇచ్చినా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోకుండా నిర్వహిస్తున్న థియేటర్లను సీల్‌ చేస్తే ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్‌ చేశామని తప్పుడు ప్రచారం చేయడం సరికాదంటోంది ప్రభుత్వం. ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన 130 థియేటర్‌లపై చర్యలు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు మంత్రి. అటు హీరోలు నాని, సిద్దార్ద చేసిన విమర్శలపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు పేర్ని నాని.

మొత్తానికి చర్చల ప్రక్రియ అయితే మొదలైంది. ప్రభుత్వం కమిటీ వేసింది. ఫిలిం ఛాంబర్‌ కూడా ప్రతినిధులను సిద్దం చేసింది. మరి సంక్రాంతి పండగ సీజన్‌ ముంచుకొస్తున్న తరుణంలో త్వరగా పరిష్కారం కావాలని నిర్మాతలు అంటున్నారు. మా వైపు ఆలస్యం ఉండదని ప్రభుత్వం అంటోంది. మరి క్లైమాక్స్‌ అనుకున్న సమయానికి పడుతుందా? మళ్లీ సీజన్‌ 2 కోసం ఆగాల్సిందేనా.?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Also read:

Heroine Anjali: బ్లాక్ శారీలో అదరగొట్టిన హీరోయిన్ ‘అంజలి’.. మైమరిపిస్తున్న ముద్దుగుమ్మ అందాలు.. (ఫొటోస్)