Big News Big Debate: BJPతో టచ్‌లోకి వెళ్లిన TRS పెద్దలెవరు.? ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీలు ఖాళీ అవుతాయా.?

టార్గెట్‌ 2023 పెట్టుకుని తెలంగాణలో పార్టీలు యుద్ధానికి సిద్దమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన తమకు 80 సీట్లు గ్యారెంటీ అంటోంది కమల దళం.

Big News Big Debate: BJPతో టచ్‌లోకి వెళ్లిన TRS పెద్దలెవరు.? ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీలు ఖాళీ అవుతాయా.?
Big News Big Debate

Updated on: Nov 26, 2021 | 9:32 PM

BJPతో టచ్‌లోకి వెళ్లిన TRS పెద్దలెవరు.?
కాంగ్రెస్‌ నుంచి చేజారుతున్న నాయకులెందరు.?
ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీలు ఖాళీ అవుతాయా.?
తెలంగాణలో BJP యాక్షన్‌ ప్లాన్‌ మొదలైందా.?

టార్గెట్‌ 2023 పెట్టుకుని తెలంగాణలో పార్టీలు యుద్ధానికి సిద్దమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన తమకు 80 సీట్లు గ్యారెంటీ అంటోంది కమల దళం. కాంగ్రెస్‌, BJPల నుంచి భారీగా వలసలు ఉంటాయంటూ బాంబ్ పేల్చారు తరుణ్‌చుగ్‌. అంతసీన్‌ లేదన్న TRS నాయకులు కారు స్పీడుకు ఎవరూ బ్రేకులు వేయలేరంటున్నారు. అటు BJ Pవాపును చూసి బలం అనుకుంటుందని ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నాయకులు.

తెలంగాణలో 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌. అధికార TRS‌కు కాంగ్రెస్ పార్టీ B-టీంగా మారిందన్నారు. ప్రజల్లో ఈ రెండు పార్టీల పట్ల విశ్వాసం లేదని.. BJPలో చేరేందుకు డజన్ల కొద్దీ నేతలు సిద్దంగా ఉన్నారంటూ బాంబ్ పేల్చారు తరుణ్‌ చుగ్‌. త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయన్న ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయమని కామెంట్‌ చేశారు.

బీజేపీ నేతల మాటలకు నిజామాబాద్ MLC ఫలితాలే సమాధాన్నారు కవిత. రెండు జాతీయ పార్టీలు కనీసం పోటీ పెట్టలేక పోయాయన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన TRS క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఎమ్మెల్సీ. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యాయం ముగియలేదని.. బీజేపీనే వాపును చూసి బలం అనుకంటుందన్నారు హస్తంపార్టీ సీనియర్లు. రఘనందన్‌, ఈటల రాజేందర్‌ విజయాలు వ్యక్తిగతమని.. అవే రాష్ట్రమంతా వస్తాయనుకోవడం అత్యాశే అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. అటు TRSలో కొందరు సీనియర్లు పార్టీకి రిజైన్‌ చేయడం.. ఇటు తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ కాషాయం జెండా కప్పుకోవడానికి సిద్ధమైన నాయకులు ఎవరా అంటూ చర్చ అప్పుడే మొదలైంది.

తెలంగాణలో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు.. సీట్లు
2004
TRS – 6.68% సీట్లు -26
కాంగ్రెస్‌ – 38.56% సీట్లు-185
బీజేపీ – 2.63% సీట్లు-2
——————
2009
TRS – 3.99 % సీట్లు -10
కాంగ్రెస్‌ – 36.55% సీట్లు-156
బీజేపీ – 2.84% సీట్లు-2
——————–
2014
TRS – 34.3% సీట్లు -63
కాంగ్రెస్‌ – 25.2% సీట్లు-21
బీజేపీ – 7.1% సీట్లు-5
———————-
2018
TRS – 46.87% సీట్లు -88
కాంగ్రెస్‌ – 28.43% సీట్లు-19
బీజేపీ – 6.98% సీట్లు-1
———————–
2019 పార్లమెంట్‌
TRS – 41.29% సీట్లు -9
కాంగ్రెస్‌ – 29.48% సీట్లు-3
బీజేపీ – 19.45% సీట్లు-4

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

Also Read: Viral Video: ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో

కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ.. పాపం చిట్టి తల్లి