AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: రణరంగంగా మారిన మునుగోడు.. పరిస్థితి అదుపు తప్పుతోందా..? లైవ్ వీడియో..

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రచారం చివరి రోజు మునుగోడు మండలంలోని పలివెల గ్రామం రక్తసిక్తంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు కారణం టీఆర్ఎస్‌ అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఓటమి తప్పదన్న నిరాశ, నిసృహతో బీజేపీ నాయకులే దాడులకు తెగబడ్డారంటోంది అధికార పార్టీ.

Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2022 | 7:31 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రచారం చివరి రోజు మునుగోడు మండలంలోని పలివెల గ్రామం రక్తసిక్తంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు కారణం టీఆర్ఎస్‌ అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఓటమి తప్పదన్న నిరాశ, నిసృహతో బీజేపీ నాయకులే దాడులకు తెగబడ్డారంటోంది అధికార పార్టీ. ఘటనపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరించింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

మునుగోడు ఎన్నికల ప్రచారం చివరరోజు పలివెల గ్రామం రణరంగంగా మారింది. ప్రచార గడువు కొన్ని గంటల్లో ముగుస్తుందనగా.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ర్యాలీ నిర్వహిస్తుండగా టీఆర్ఎస్‌ బైక్‌ ర్యాలీ ఎదురైంది. ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా గొడవ మొదలైంది. దీంతో చేతిలో ఉన్న జెండా కర్రలతో బాహాబాహికి దిగారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలు కార్లు ధ్వంసం కాగా.. కొందరు గాయపడ్డారు. టీఆర్ఎస్‌ నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి చెవికి గాయం కాగా… అటు బీజేపీ నేత ఈటల అనుచరులు గాయపడ్డారు.

కక్ష పూరితంగానే ఈటల రాజేందర్‌పై దాడులకు పాల్పడ్డారన్నారు కేందమంత్రి కిషన్‌రెడ్డి. ఈటల రక్తం చింది ఉంటే ఇవాళ పరిస్థితి మరోలా ఉండేదని వార్నింగ్‌ ఇచ్చారు. అటు ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా టీఆర్ఎస్‌ గుండాలు ఇక్కడ మకాం వేశారని.. పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే మేమే రంగంలో దిగుతామంటూ హెచ్చరించారు బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌. ప్రజాస్వామ్యబద్దంగానే ఎన్నికలు ఎదుర్కొంటామని.. ఓటమి చెందుతామని నిరాశ, నిసృహతో బీజేపీయే దాడులకు తెగపడుతుందన్నారు టీఆర్ఎస్‌ మంత్రులు.

మరోవైపు తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ ఫిర్యాదు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ వేసిన కాషాయం పార్టీ ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బ్యాంకు అకౌంట్లు కూడా హ్యాక్‌ చేసి మరీ చూస్తున్నారని దీనిపై విచారణ జరిపించాలంటోంది.

మొత్తానికి అటు స్ట్రీట్‌ ఫైట్‌… ఇటు లీగల్‌ బ్యాటిల్‌ తో మునుగోడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అటు సెంట్రల్‌ ఎలక్షన్ కమిషన్‌ అలర్ట్‌ అయింది. పోలింగ్‌ రోజు అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఇక ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో కింద చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..