Adhi Yoga
ప్రస్తుతం ఆరు రాశుల వారికి అధియోగం పట్టింది. ఏదైనా రాశికి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో గ్రహాలున్నప్పుడు (రాహు, కేతువులు మినహా) అధి యోగం ఏర్పడుతుంది. అధి యోగం అంటే అధికారం, ఆదాయం కలగలసిన యోగం అన్నమాట. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు ఆదాయ వృద్ధి కూడా ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం, సానుకూలతలు పెరగడం, జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, అదనపు రాబడికి అవకాశాలు ఏర్పడడం ఈ అధియోగ లక్షణాలు. ప్రస్తుతం మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఈ యోగం ఏర్పడింది. ఇది మరో మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో కుజ, శుక్రులు సంచారం చేస్తున్నందువల్ల అధి యోగం ఏర్ప డింది. చాలాకాలంగా పెండింగులో ఉన్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇప్పుడు చేతికి అందడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగు లకు మంచి జీతభత్యాలు, హోదాతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రాబడి బాగా పెరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, శుక్రులు, అష్టమ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల అధి యోగం ఏర్పడింది. దీనివల్ల ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరు గుతుంది. ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. జీతభత్యాల్లో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
- సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో కుజ, శుక్రులు, సప్తమ స్థానంలో రవి, బుధ, శనులు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అధి యోగం ఏర్పడింది. దీని ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి, ఊహించని స్థాయిలో ప్రాధాన్యం, ప్రాభవం సంపాదించుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. సామాజికంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. అందుకు తగ్గట్టుగానే రాబడి కూడా పెరిగే అవకాశముంటుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి, బుధ, శనులు సంచారం చేస్తున్నందువల్ల అది యోగం ఏర్పడింది. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల విషయంలో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలున్నా తేలికగా తొలగి పోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఒక మెట్టయినా పైకి ఎక్కడం జరుగుతుంది. దాంతో పాటే ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల అధి యోగం ఏర్పడింది. దీని ఫలి తంగా, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. సర్వత్రా ప్రాభవం, ప్రాబల్యం పెరుగు తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక హోదా కూడా లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల అధి యోగం ఏర్పడింది. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం, రుణ సమస్యల నుంచి విముక్తులు కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం పెరగడం వల్ల ప్రమోషన్ లభించడం, ఆదాయం పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు కూడా మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది.