వార ఫలాలు (మార్చి 3 నుంచి మార్చి 9, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకావం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. చిన్న ప్రయత్నం కూడా సానుకూల ఫలితాలనిస్తుంది. ప్రయా ణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. భరణి నక్షత్రం వారు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రతి రోజూ లలితా సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. ఉద్యోగం మారడానికి కూడా ప్రయత్నించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెర వేరుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విద్యార్థులకు సమయం బాగానే ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వివాదా స్పద వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ భాగస్వామితో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లోనే కాక, పరీక్షల్లోనూ ముందుంటారు. పునర్వసు నక్షత్రం వారికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. శివార్చన వల్ల మేలు జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరత్వం లభించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి జీవితంలో వేగం, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాలలో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని ఖర్చులు, సహాయాలతో కాస్తంత ఇబ్బంది పడతారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామికి తన వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పుష్యమి నక్షత్రంవారు ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి నరసింహ స్వామిని స్తోత్రం చేయడం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండు తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ప్రాభవం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. శివార్చన చేయించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. తీరిక, విశ్రాంతి ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధి స్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసు కుంటాయి. బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి. వృత్తి జీవి తంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నమూ అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహా రాలు రొటీనుగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ ఎక్కువవు తుంది. ఉత్తరా నక్షత్రం వారికి శుభ వార్తలు అందుతాయి. విష్ణు సహస్ర నామం చదువుకోవడం వల్ల మనసులోని కోరికలు నెరవేరు తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది. మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. అధికారుల వేధింపులు కూడా తప్పక పోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మంచి మార్పులు తలపెడతారు. ఏ విషయంలోనైనా ఆలో చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం అవసరం. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. విద్యా ర్థులు కష్టపడాల్సి ఉంటుంది. అనూరాధ నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల కొన్ని కష్టాలు, సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కు తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా ఊపందు కుంటాయి. లాభసాటిగా ముందుకు వెడతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవ హరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విద్యార్థులు పురో గతి సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. శివార్చన చేయించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. వారమంతా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. శ్రవణం వారికి ధన యోగం ఉంది. దుర్గాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలతో పాటు పనిభారం పెరుగుతుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయ త్నం విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా ఒకటి రెండు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. శతభిషం వారికి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. సుందరకాండ పారాయణం వల్ల వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విలా సాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందు తుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందు తాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉత్తరా భాద్ర నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం మంచిది.