Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

| Edited By: Janardhan Veluru

Mar 17, 2024 | 5:01 AM

వార ఫలాలు (మార్చి 17 నుంచి మార్చి 23, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మిథున రాశి వారికి గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందున అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా గడిచి పోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope 17th March 23rd March 2024
Follow us on

వార ఫలాలు (మార్చి 17 నుంచి మార్చి 23, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మిథున రాశి వారికి గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందున అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా గడిచి పోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. అధికారులతో సామరస్యం ఉంటుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా, ఆశించిన విధంగా కొనసాగుతాయి. అయితే, బాగా శ్రమాధిక్యత కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల వ్యవహారాలతో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి బాగా పెరుగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి సమసిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా గడిచి పోతాయి. లాభదాయక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగుల మీద అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనాదాయానికి లోటుండదు. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సొంతగా నిర్వర్తించుకోవడం మంచిది. విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో కొన్ని సమస్యలు పరిష్కారమై, లాభాల బాటపడతాయి. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సప్తమ స్థానంలో కుజ, శనుల సంచారం వల్ల బంధువర్గంతోనూ, కొందరు మిత్రులతోనూ మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలున్నా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. తలపెట్టిన పనులు, కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. సోదరులతో ఆస్తి వివాదం తలెత్తే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో హోదా పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు అతి వేగంగా పూర్తవుతాయి. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా గడుస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం, గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. దగ్గర బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఇష్టమైన పనులు చేయడం, ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం వంటివి జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబసమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. సోదరులతో విభే దాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవు తాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహకాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరించడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. అనుకోకుండా దగ్గర బంధువులను కలుసుకుంటారు. అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉన్నత స్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలపరంగా ఊపందుకుంటాయి. ఉద్యోగులు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల చదువులు, ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసటుంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగు తాయి. శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే ఉంటాయి. శ్రమాధిక్యత కూడా ఎక్కువగా ఉంటుంది. తల పెట్టిన పనులు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రాశినాథుడైన శనీశ్వరుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఆరోగ్య సంబంధమైన సమ స్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఇతర గ్రహాలు అను కూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కార్యజయం కలుగుతుంది. ఆస్తి వివాదం పరి ష్కారమయ్యే అవకాశం ఉంది. మిత్రుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు చక్కబడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వాహన సౌకర్యం ఏర్పడు తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశముంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అంది వస్తాయి. ఏ పని తలపెట్టినా అవసరమైన సహాయం అందుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో చిన్న చిన్న చికాకుల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కార్యక్ర మాలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.