Weekly Horoscope: ఆ రాశులవారికి ఆదాయం భారీ పెరిగే ఛాన్స్, అన్నింటా లాభాలు.. 12 రాశుల వారఫలాలు..
వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ప్రదేశాలకు వెడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ వివరాలు..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహబంల బాగా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. తలకు మించిన పనుల్ని తలకెత్తుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నంతో ముఖ్య మైన వ్యవహారాలన్నిటినీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు, ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరిగి బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు చాలా వరకు తగ్గుతాయి. ప్రయా ణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వారమంతా సాదా సీదాగా సాగిపోతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. మిత్రులకు ఎక్కువగా సహాయం చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగు తుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్ర త్తలు పాటించడం మంచిది. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది కానీ, అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. పిల్లలకు శ్రమ పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగా ప్రశాంతంగా ఉంటుంది. బంధువులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగి స్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వారమంతా అనుకూలంగా సాగిపోతుంది కానీ, కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవ కాశం ఉంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉన్నత స్థాయి వారితో పరిచ యాలు విస్తరిస్తాయి. కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు ఆశించిన విధంగా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగుల్లో పట్టుదల పెరుగు తుంది. ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో సరికొత్త మార్పులు చేపడతారు. ఇంటా బయటా సానుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గ్రహ బలం వల్ల వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరు గుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారం అవు తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పనిభారం, ఒత్తిడి వంటివి బాగా తగ్గుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు మీ సలహాల ద్వారా ఉపయోగం కలుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. పిల్లలు మరింతగా శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
తల్లితండ్రుల జోక్యంతో కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగు తాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలి తాలనిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మొత్తం మీద అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు లభిస్తాయి. పేరు ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగు తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలపెట్టకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభి స్తుంది. బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులవారికి ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయాన్ని పెంచుకునేందుకు, కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సామ రస్యంగా సాగిపోతుంది కానీ, కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందర పాటు మాటలు, నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయటా అనుకూ లతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో అధికార బాధ్యతలను కూడా నిర్వ ర్తించడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రధానమైన ఆర్థిక అవసరాలన్నీ తీరిపో తాయి. ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. లాభాలకు లోటుండకపోవచ్చు. బంధుమిత్రుల మీద ఆధార పడకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు ఎక్కు వగా వింటారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణా లకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ప్రదేశాలకు వెడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం హుషారుగా సాగిపోతుంది. అధికారులతో సమస్యలు తొలగిపోయి, సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు వృద్ధి చెందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సమాధానాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెడతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తల్లితండ్రుల నుంచి అవసర సహాయం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుం టారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.