Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా చికాకులే, పని ఒత్తిడి.. శనివారం రాశిఫలాలు ఇలా..

ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్త వుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి.

Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా చికాకులే, పని ఒత్తిడి.. శనివారం రాశిఫలాలు ఇలా..
Horoscope
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2024 | 9:21 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. ఆదాయ మార్గాలకు ఇబ్బంది ఉండదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రముఖులతో లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ధనపరంగా కొందరు మిత్రు లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం ప్రారంభిస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. బాగా ఇష్టమైన బంధువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక ప్రయత్నాలతో సహా ముఖ్యమైన ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిభకు మంచి గుర్తింపు లభి స్తుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్త వుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్తంత అను కూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో వెనుకాడే అవకాశం ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందు తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం కొద్దిగానైనా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగు తాయి. కుటుంబ జీవితం సరదాగా, సంతోషంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యంలో నిలకడగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొందరు బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి కొండంత అండగా ఉంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఒకటి రెండు ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. సహా యం పొందిన మిత్రులు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు సానుకూ లంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ఉద్యోగంలో అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆశించిన శుభ వార్తలు అందుకుంటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇత రులకు సహాయం చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. సహచరుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలున్నాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. మాట తొందర వల్ల బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవు తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పెద్దల నుంచి అనేక విధాలుగా సహాయం అందుతుంది. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రమ, తిప్పట ఎక్కువగానే ఉన్నా ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండడానికి ఇది సమయం కాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బాగా ఒత్తిడికి గురవుతారు. ఆహార, విహారాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన చేయూత లభిస్తుంది.

Latest Articles