
వార ఫలాలు (ఏప్రిల్ 7 నుంచి 13 2024 వరకు): మేష రాశిలో గురువు, లాభస్థానంలో రాశ్యధిపతి కుజుడు, లాభాధిపతి శనీశ్వరుడు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏదో రూపేణా ఆర్థిక లాభం కలుగుతూనే ఉంటుంది. వృషభం రాశి వారికి లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, బుధుడు, రవి ఉండడం వల్ల అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. మిథునం రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న శని, లాభ స్థానంలో ఉన్న గురువు, దశమ స్థానంలో ఉన్న శుక్ర, రవుల వల్ల అటు కుటుంబపరంగా, ఇటు కెరీర్ పరంగా శుభ యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. అయితే, మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ రాశిలో గురువు, లాభస్థానంలో రాశ్యధిపతి కుజుడు, లాభాధిపతి శనీశ్వరుడు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏదో రూపేణా ఆర్థిక లాభం కలుగుతూనే ఉంటుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అయితే, వ్యయ స్థానంలో శుక్ర, బుధ, రవులున్న కారణంగా, విలాస జీవితం మీద ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. మధ్య మధ్య వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాలకు మించి లాభాలు అందుతాయి. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవ కాశముంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు, చదువులు, పరీక్షల్లో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచిపో తాయి.
లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, బుధుడు, రవి ఉండడం వల్ల అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అయితే, వ్యయంలో గురువు ఉండడం వల్ల శుభ కార్యాలు, దైవ కార్యాల మీద బాగా ఖర్చవుతుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారా లను పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న శని, లాభ స్థానంలో ఉన్న గురువు, దశమ స్థానంలో ఉన్న శుక్ర, రవుల వల్ల అటు కుటుంబపరంగా, ఇటు కెరీర్ పరంగా శుభ యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అయితే, దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు నీచబడడం వల్ల ఆరోగ్యం సంగతి చూసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన అందుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
నవమ స్థానంలో శుక్ర, బుధ, రవుల సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం జరు గుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. అష్టమ శని, దశమ గురువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు ఒక పట్టాన మీ పనితీరుతో సంతృప్తి చెందరు. వ్యాపారాలు కాస్తంత అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యా నికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
సప్తమంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఊహించని పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో పెద్దగా ఇబ్బందులుండే అవకాశం లేదు. అయితే, అష్టమంలో శుక్ర, రవి, బుధుల కారణంగా ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. విశ్రాంతి బాగా తగ్గిపోతుంది. కుటుంబంలో చికాకులు తప్పవు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తి కరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచిపోతాయి.
ఆరవ స్థానంలో కుజ, శనులు, సప్తమంలో శుక్ర, బుధ, రవుల సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అయితే, అష్టమంలో గురువు ఉండడం వల్ల వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛస్థితిలో, సప్తమంలో గురువు సంచారం ఈ రాశివారికి తప్పకుండా రాజ యోగం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరు గుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మంచి పరి చయాలు ఏర్పడతాయి. అయితే, ఆరవ స్థానంలో బుధ, రవుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పొరపాట్లు చేసే అవకాశముంది. లేనిపోని వ్యవహరాల్లో తలదూర్చడం కూడా జరుగు తుంది. కొందరు బంధువులు మీ వల్ల బాగా లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఎంతో ఉత్సాహంగా సాగిపోతాయి.
పంచమంలో శుక్ర బుధ రవులు కలిసి ఉండడం ఎంతో యోగదాయకంగా ఉంది. ఫలితంగా ఆశించిన శుభవార్తలు వినడం, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుఝంది. ఉద్యోగంలో ప్రతిబా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పని చేస్తున్న సంస్థలకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడతారు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. అయితే, చతుర్థంలో శని, కుజులు, ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుం బంలో కొద్ది టెన్షన్లు ఉంటాయి. అంచనాలకు మించి డబ్బు ఖర్చవుతుంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
రాశ్యధిపతి గురువు పంచమంలో, శని, కుజులు తృతీయంలో, బుధ, శుక్ర, రవులు చతుర్థంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా ఇది రాజయోగ కాలమని చెప్పాలి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు, జీతభత్యాలు కూడా పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉంటాయి. కొన్ని ముఖ్య మైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో, రవి, బుధ, శుక్రులు తృతీయంలో సంచారం చేస్తున్నం దువల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. అది మరింత మెరుగవడానికే అవకాశాలు ఎక్కువ. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా సంపాదించడం జరుగుతుంది. బ్యాంకు నిల్వలు పెరుగుతాయి. ఉద్యో గంలో హోదాతో పాటు, జీతభత్యాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరు గుతాయి. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
ధన స్థానంలో శుక్ర, బుధ, రవుల సంచారం వల్ల ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఆర్థిక అవసరాల్లో ఎక్కువ భాగం తీరిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సరదాగా సాగిపోతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అయితే, కుంభ రాశిలో కుజ, శనుల సంచారం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ పూర్తి కాదు. అధికా రులు అతిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. పని భారం పెరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడ తాయి.
ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల, బుధ, రవులు కూడా ఇక్కడే ఉండడం వల్ల, రాశ్యధిపతి గురువు ధన స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక పరిస్థితికి తిరుగుండదు. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వ్యయ స్థానంలో కుజ, శనుల సంచారం వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యో గులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.