టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిన ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకొవాలనుకుంటారు చాలా మంది. రోజులో తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే వారంతంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు చాలా వరకు. ఈ క్రమంలోనే రాశి ఫలాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ఈవారం మేష రాశి నుంచి మీనం వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేష రాశి..
ఈ వారంలో వీరు ఆర్థికంగా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. అలాగే చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఇంటినిర్మాణం చేపడతారు. అలాగే ఉద్యోగాలలో స్థాన చలనం ఏర్పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. ఈ వారంలో వీరు రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
వృషభ రాశి..
ఈవారంలో వీరు చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు మెరుగపడతాయి. అలాగే రుణ భాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కుటుంబ సమస్యలతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఏర్పడుతుంది. వీరు ఈ వారం దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి.
మిథున రాశి..
ఈ వారంలో వీరు చేపట్టిన పనులుు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారుు. కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద చూపించాలి. ఈవారంలో వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాలలో, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కోంటారు. వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటారు. రుణాలు పొందుతారు. ఈవారం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కర్కాటక రాశి..
ఈవారం వీరికి అన్ని శుభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మెరుగుపడతాయి. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఈవారంలో వీరు రోజూ సూర్యాస్తుతి చేయడం మంచిది.
సింహ రాశి..
ఈవారంలో వీరికి ఉద్యోగ ప్రయత్నాలు సాధిస్తారు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆస్తి వివదాలు పరిష్కరమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వారంలో వీరికి బంధువులతో విభేధాలు కలుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం వీరి ఆదిత్య హృదయం పఠించాలి.
కన్య రాశి..
ఈవారంలో ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ శత్రువులకు, సమస్యలను సృష్టించే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగవకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఆప్తులతో విభేదాలు కలుగుతాయి. ఈవారంలో వీరు రోజు శివుడిని పూజించాలి.
తుల రాశి..
ఈవారంలో వీరికి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం అందుకుంటారు. అనుకున్న పనులను ఆచరణలో పెడతారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. వాటిని తిరిగి చాకచాక్యంగా పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈవారంలో వీరు ఎక్కువగా శివుడిని ఆరాధించాలి. అలాగే శివపంచాక్షరి పఠించాలి.
వృశ్చిక రాశి..
ఈవారంలో వీరికి సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు..చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. ఇంటి నిర్మాణాలను మొదలుపెడతారు. బంధువులతో సఖ్యత ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వీరి ఈ వారంలో ఆంజనేయ దండకం పఠించాలి.
ధనుస్సు రాశి..
ఈవారంలో వీరు నూతన విషయాలను తెలుసుకుంటారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. శ్రమకు ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఉద్యోగ సమస్యలను తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. నూతన బాధ్యతలు అందుకుంటారు. ఈ వారంలో వీరి మానసిక ఒత్తిడి ఎదుర్కోంటారు. ఈ వారం వీరి గణేషుడిని పూజించాలి.
మకర రాశి..
ఈవారం వీరి ఆర్థికంగా మెరుగుపడతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి విషయంలో సమస్యలు పెరుగుతాయి. వాటిని తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఈ వారం వీరు శ్రీరాముడిని పూజించడంతోపాటు.. శ్రీరామ రక్షాస్తోత్రాలు పఠించాలి.
కుంభ రాశి..
ఈవారంలో వీరు ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. అలాగే సోదరులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మెరుగుపడతారు. నూతన ఉద్యాగావకాశాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలలో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యుల మద్ధతు లభిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. ఈ వారం వీరి హయగ్రీవస్తోత్రాలు పఠించాలి.
మీన రాశి..
ఈవారంలో వీరు ఆప్తుల సలహాలతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఉద్యోగావకాశాలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈ వారంలో వీరు ఎక్కువగా నవగ్రహస్తోత్రాలు పఠించాలి.
Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఏ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయంటే..
Telangana Rains: రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం.. పలు కాలనీలు, ఇళ్లల్లోకి వర్షపునీరు.. జనం అవస్థలు