వార ఫలాలు (ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందున ఈ వారమంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. వారమంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. దేనికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవ సరం. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ఐ.టి నిపుణులు తదితర రంగాల వారికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విదేశాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
శని, రాహు గ్రహాలతో పాటు, రాశ్యధిపతి శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభం ఉంటుంది. మిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. ఆస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విషయంలోనూ తల దూర్చ వద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాదిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కు తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శని, రవుల సంచారం వల్ల వారమంతా ఆర్థికపరంగా హ్యాపీగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా చాలావరకు అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణ సూచ నలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలించి దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల నష్టపోయే అవ కాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులకు బాగుం టుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల వార మంతా తృప్తికరంగానే గడిచిపోతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు శ్రమపడక తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. రహస్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అన్ని విధాలు గానూ రాబడి పెరుగుతుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా లాభాల పరంగా వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. శరీరానికి విశ్రాంతి ఉండక పోవచ్చు. కోరుకున్న పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. దూర ప్రాంతంలోనే అయినా నిరుద్యో గులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో సతీమణి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల వారమంతా సాదా సీదాగా గడిచిపో తుంది. వ్యక్తిగతంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అతి తేలికగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సతీమణి సహాయంతో ముఖ్యమైన కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండక పోవడం మంచిది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గ్రహ బలం బాగున్నందువల్ల వారమంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆస్తి వివాదా లకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపో తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ వారమంతా గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని ముఖ్యమైన కోరి కలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి జోక్యంతో స్థిరాస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఎటువంటి వాగ్దానాలూ చేయక పోవడం మంచిది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర వాలేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగానే ఉండడం వల్ల వారమంతా సానుకూలంగా సాగిపో తుంది. ఇంటా బయటా అనుకూలతలు నెలకొంటాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవు తాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు మార్చు కుంటారు. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధమైన కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యా ర్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగాల్లో శ్రమ పెరిగినప్పటికీ అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. సతీమణితో ఇష్టమైన ఆలయాలను, ప్రదేశాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వ్యయ ప్రయాసలుకూడా తప్పకపోవచ్చు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు రొటీనుగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
శుభ గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. అందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో బాగా సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శి స్తారు. ఆదాయపరంగా కొత్త ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. రాజకీయంగా ప్రాముఖ్యం పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.