Weekly Horoscope: నేటికీ జాతకాలను నమ్మేవారు ఉన్నారు. నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వార ఫలాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. రాశిఫలాలను ఆధారంగా తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి (ఆగష్టు 14వ తేదీ) ఆగష్టు 20వ తేదీ వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ వారంలో ఈ రాశివారు సర్దుకుపోయే ధోరణిని అలవర్చుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులను ఓర్పుతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపారస్థులు ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న ఫలితం సాధిస్తారు.
వృషభ రాశి: ఈ వారంలో ఈ రాశివారికి పెద్దల ఆశీస్సులతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. స్నేహితులు, బంధువులు సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్తగా పనులను ప్రారంభిస్తారు. ముఖ్య పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మిథున రాశి: ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంలో అలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. సహనానికి పరీక్ష వంటిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంది.. క్రమేణా పెరుగుతుంది. మిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. పనుల్ని వాయిదా వేయవద్దు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు ప్రశంసలను అందుకుంటారు. ఇంట్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభకాలం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొత్తపెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సకాలంలో పనుల్ని పూర్తిచేయండి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
సింహ రాశి: ఈ వారంలో ఈ రాశివారు చంచలన నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయుల సలహాలతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మిశ్రమకాలం. వృధా ఖర్చులు చేస్తారు. చేపట్టిన పనులను మధ్యలో ఆపకుండా పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. బంధుమిత్రులతో తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. శాంతస్వభావంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అపార్థాలకు తావివ్వకండి.
కన్య రాశి: ఈ రాశివారు ఈ వారంలో ఉద్యోగస్తులకు శుభఫలితాలు ఉంటాయి. ధన యోగం ఉంది. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ఫలం అందుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సంయమనం పాటిస్తే మేలు జరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. చిక్కులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
తుల రాశి: ఈ రాశివారికి ఈ వారంలోఅధికారుల పోత్సాహంతో ముందుకు వెళ్లారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలలో చిక్కుకునే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. అనవసరమైన ఆలోచనలతో కొన్ని ఇబ్బందులు రావచ్చు.
వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. ఆర్ధికంగా కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనవసర వ్యయం తగ్గించుకోవడం మంచిది. ఆపద నుంచి బయటపడతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: ఈ రాశివారు ఈ వారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. భవిష్యత్ కోసం అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని పనులు అధిక శ్రమతో పూర్తి చేస్తారు. బంధువులు,స్నేహితుల రాకతో అధికంగా ఖర్చు చేస్తారు. డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. లక్ష్యాన్ని త్వరగా చేరతారు. బంధుమిత్రుల ప్రశంసలు లభిస్తాయి. అపోహలు తొలగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థికవృద్ధి ఉంటుంది.
మకర రాశి: రాశివారు ఈ వారంలో ముఖ్య పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికంగా ఖర్చులు చేయడంతో ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కోవచ్చు.. పరీక్షాకాలం. ఆవేశానికి పోకుండా పనులు పూర్తి చేసుకోవాలి. అనవసర వ్యయం పెరగకుండా చూసుకోవాలి.
కుంభ రాశి: ఈరాశి వారి ఈ వారంలో అన్నింటా అనుకూలంగా ఉంటుంది. అన్నిరంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాలం సహకరిస్తోంది. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు.
మీన రాశి: ఈ వారం ఈ రాశి వారికి శుభకాలం. వ్యాపార స్థులకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయరంగంలో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది. సమిష్టగా నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపార విస్తరణ జరుగుతుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. అనవసరమైన ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. చెడు ఆలోచనలు మనసులో రాకుండా చూసుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)