Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12, 2024 వరకు): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
వార ఫలాలు (అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12, 2024 వరకు): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాల అనుకూలత బాగా ఎక్కువగా ఉంది. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకుల నుంచి పూర్తిగా బయటపడతారు. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ధన పరమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. చేపట్టిన వ్యవహారాలు, పనుల్లో ఆశించిన ఫలితం కనిపిస్తుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ధన, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. రోజూ ఉదయం సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తు సామగ్రి, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికార ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కొంత కాలం పాటు ప్రతి రోజూ ఆదిత్య హృదయం పఠించడం అవసరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
చతుర్థ, లాభ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభ సాటిగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు, ఆఫర్లు పెరుగు తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శివార్చన చేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆదాయం పెరిగే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. బంధువులతో అకారణ మాట పట్టిం పులు ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుం టారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ధన, భాగ్య స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయిలో ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం మెరుగుతుంది. ఆస్తులు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సుందరకాండ పారాయణం చాలా మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆరోగ్యం కూడా బాగా కుదుటపడుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. విలాస జీవితం అలవడుతుంది. సుఖ సంతోషాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యు లతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దాదాపు ప్రతి వ్యవహారమూ లాభదాయకంగా కొనసాగు తుంది. ఆకస్మిక ధన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు మించిన ఫలితాలు పొందు తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అప్రయత్నంగా పరి ష్కారం అవుతుంది. నరసింహ స్వామి స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సప్తమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారం కావడం వంటివి జరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు తగిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ప్రతి రోజూ దుర్గా మాతను స్తుతించడం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శని, శుక్ర, రవుల అనుకూలతల వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అప్రయత్న ధన లాభం కూడా ఉంటుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, పదోన్నతులకు సంబంధించి శుభ వార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం బాగా పెరిగినా అందుకు తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం సరదాగా, హుషారుగా సాగిపో తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. రోజూ విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల విజయాలు లభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
పంచమ, నవమ, దశమాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధి కార యోగానికి అవకాశం ఉంది. ప్రముఖుల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి అరుదైన ఆహ్వా నాలు అందుతాయి. చేపట్టిన ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ సకాలంలో పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. తల్లితండ్రుల నుంచి ధన లాభ సూచనలు న్నాయి. కొన్ని బరువు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆహార విహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమ స్యల ఒత్తిడి తగ్గుతుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల ఆలస్యాలు, ఆటంకాలు తగ్గుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గ్రహ బలం తక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా నిదానంగా సాగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ద పెరుగుతుంది. లలితా సహస్ర నామ స్తోత్ర పఠనం చాలా అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
గ్రహ బలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా శుభ వార్తలు వింటారు. ప్రయ త్నాలు, వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఇప్పుడు చేసే ప్రయత్నాలు, చేపట్టే కార్యక్రమాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందు తాయి. ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు. కుటుంబ సమస్యల పరిష్కారం విషయంలో కాస్తంత ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. రోజూ దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల లాభం ఉంటుంది.