జ్యోతిష్య శాస్త్రలో నవగ్రహాల్లో శుక్ర గ్రహం వెరీ వెరీ స్పెషల్. శుక్రుడు ఐశ్వర్యం, సంపదకు కారకంగా భావిస్తారు. శుక్ర గ్రహణ సంచార సమయంలో అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపిస్తే.. మరికొన్ని అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఈ నేపథ్యంలో రేపు శుక్ర గ్రహణం రేపు (మంగళవారం) మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. శుక్రుడు సంచారం జేష్ట మాసంలోని శుక్లపక్షం దశమి తిథిన మొదలు కానుంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యులు కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకుని వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపటి నుంచి శుక్రుడు సంచారం ఏ రాశి వ్యక్తులకు లక్కీని తీసుకుని వస్తుందో తెలుసుకుందాం..
మేష రాశి: కర్కాటక రాశిలోకి శుక్ర గ్రహం అడుగు పెట్టి సంచరించనున్నాడు. దీంతో ఈ రాశి వ్యక్తుల జీవితం సంతోషముగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పనులు చేపట్టినా సక్సెస్ అందుకుంటారు. శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాదు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటక రాశి: శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికీ మంచి ప్రయోజనాలు ఇస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. చేపట్టిన పనుల్లో మంచి లాభాలను పొందుతారు. శ్రమకు తగిన లాభాలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్య బంధం ఆహ్లాదకరంగా సాగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశివారు రేపటి నుంచి అన్ని శుభవార్త వింటారు. విద్యార్థులు శుభ ప్రయోజనాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎటువంటి పని చేపట్టినా శుభఫలితాలను అందుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారి జాతకంలో రేపటి నుంచి శుక్రుడు ఐదో స్థానంలో సంచరించనున్నాడు. ఆర్ధికంగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడుపుతారు. భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో, కుటుంబంలో సంబంధాలు సంతోషకరంగా ఆహ్లాదకరంగా సాగుతాయి.
కుంభ రాశి: ఈ రాశి వారి ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి అన్నింటా లాభాలే.. సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించవచ్చు. విలువైన వస్తువులు కొనాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).