Shukra Gochar: కన్యా రాశిలోకి శుక్రుడు..ఇక ఈ రాశుల వారికి లక్ష్మీయోగం!
Venus Transit in Virgo 2026: నవంబర్ 6 నుంచి 22 వరకు కన్యా రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఆరు రాశుల వారికి ధన ధాన్య సమృద్ధి యోగం, లక్ష్మీయోగం కలగనున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు, ఆర్థిక పురోగతికి అవకాశాలు లభించనున్నాయి. ఈ రాశుల వారు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సంపన్నులయ్యే సూచనలున్నాయి.

Shukra Gochar 2026 Lakshmi Yoga
ఈ నెల(నవంబర్) 6 నుంచి 22 వరకు శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం. అయితే, వక్రించి ఉండడం వల్ల శుక్రుడికి నీచభంగం కలిగింది. సుఖ సంతోషాలకు, సిరిసంపదలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు ధన ధాన్య సమృద్ధి యోగం, లక్ష్మీయోగం కలిగాయి. ఫలితంగా ఈ రాశులవారు ప్రయత్నాలను పెంచడం, తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల శ్రీమంతులయ్యే అవకాశం ఉంది. ఈ రాశులవారు అదనపు ఆదాయ ప్రయత్నాలతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల మీద దృష్టి పెట్టడం మంచిది.
- వృషభ రాశి: రాశ్యధిపతి శుక్రుడికి పంచమ స్థానంలో నీచభంగం కలగడం వల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థికంగా బాగా పురోగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో దూసుకు పోతారు. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా అందలాలు లభించి, సుఖ సంతోషాలు బాగా వృద్ది చెందుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
- మిథున రాశి: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో నీచభంగం చెందినందువల్ల ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. ధన యోగాలు పడతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా హోదా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
- కన్య రాశి: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడికి నీచభంగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. కొన్ని కష్టనష్టాలు పూర్తిగా తొలగి పోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించిన లాభాలు గడించడం జరుగుతుంది.
- వృశ్చిక రాశి: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడికి నీచభంగం జరగడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభి స్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- ధనస్సు రాశి: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడు వక్రించి, నీచభంగం చెందడం వల్ల ఈ నెల 22 వరకు ఈ రాశివారి జీవితం రాజయోగాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రముఖు లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితి నుంచి ఉన్నతస్థాయికి చేరుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.
- మకర రాశి: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడికి నీచభంగం కలగడం వల్ల ఈ రాశివారి జీవితం కొద్ది రోజుల పాటు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. జీవనశైలి సమూలంగా మారిపోతుంది. సిరి సంప దలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ విజయవంతమవుతుంది. ఉద్యోగం పదోన్నతులు, భారీ జీతభత్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి.
ఇవి కూడా చదవండి
Follow Us



