శుక్రుడి వక్రగతితో వీరి జీవితాల్లో కొత్త వెలుగులు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Shukra Vakri 2026: అక్టోబర్ 4 నుంచి నవంబర్ 13 వరకు శుక్రుడు తులా రాశిలో వక్రగతిలో సంచరించనున్నాడు. శుక్రుడి అనుకూలత కారణంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, విదేశీ అవకాశాలు వంటి విషయాల్లో అనూహ్యమైన మార్పులు సంభవించే అవకాశముంది.

శుభ గ్రహాలు వక్రిస్తే ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివిధ రాశులకు శుక్రుడి అనుకూలతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. చిన్న ఉద్యోగికి అందలాలు లభిస్తాయి. స్వదేశంలో ఉన్న వ్యక్తి అనుకోకుండా విదేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతుంది. ఈ నెల(అక్టోబర్) 4 నుంచి నవంబర్ 13 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో వక్రించినప్పుడు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు ఇటువంటివే జరగబోతున్నాయి. నలభై రోజుల్లో ఈ రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టాలు కలగబోతున్నాయి.
మేషం
ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో వక్రించడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. వృత్తి, వ్యాపా రాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
మిథునం
ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో కలిసి ఉన్న శుక్రుడికి వక్రగతి కలగడం వల్ల ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా వృద్ది చెందుతుంది.. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటకం
ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు వక్రించడం వల్ల అనుకోకుండా ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. తండ్రి నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
కన్య రాశి
ఈ రాశికి ధన స్థానంలో స్వస్థాన శుక్రుడి వక్ర సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంపన్న జీవితం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అపారంగా లభిస్తుంది. ఊహించని విధంగా సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటే తొలగిపోయి, సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి.
తుల రాశి
ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి వక్ర గతి వల్ల ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థితి కలు గుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమ వుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మకరం
ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు దశమ స్థానంలో వక్రించడం వల్ల కెరీర్ పరంగా కొన్ని శుభ యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. దాంపత్య జీవితం బాగా అన్యోన్యంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది.



