వృద్ధి చంద్రుడి ప్రభావం.. ఉగాది తర్వాత ఆ రాశుల వారి మనసులోని కోర్కెలు తీరడం పక్కా..!

ఉగాది పర్వదినం తర్వాత, అంటే ఏప్రిల్ 10 నుంచి చంద్రుడు వృద్ధి చంద్రుడుగా మారుతున్నాడు. మొదటగా 10, 11 తేదీల్లో మేష రాశిలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుండగా, 12, 13 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టబోతున్నాడు. ఏ జాతకంలోనైనా చంద్రుడు అనుకూలంగా ఉండే పక్షంలో వారి మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది.

వృద్ధి చంద్రుడి ప్రభావం.. ఉగాది తర్వాత ఆ రాశుల వారి మనసులోని కోర్కెలు తీరడం పక్కా..!
Ugadi Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 09, 2024 | 11:16 AM

ఉగాది పర్వదినం తర్వాత, అంటే ఏప్రిల్ 10 నుంచి చంద్రుడు వృద్ధి చంద్రుడుగా మారుతున్నాడు. మొదటగా 10, 11 తేదీల్లో మేష రాశిలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుండగా, 12, 13 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టబోతున్నాడు. ఏ జాతకంలోనైనా చంద్రుడు అనుకూలంగా ఉండే పక్షంలో వారి మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది. ముఖ్యంగా గజకేసరి యోగం పట్టడం, ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటివి జరిగినప్పుడు రాజయోగం కూడా కలిగిస్తాడు. ప్రస్తుతం ఈ చంద్ర సంచారం (మేష, వృషభ రాశుల్లో) వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులకు అత్యంత శుభ యోగాలు అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ చంద్ర సంచారం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందబోయేది మేష రాశివారే. ఈ రాశిలో గజ కేసరి యోగం ఏర్పడడం ఒక విశేషం కాగా, ఆ తర్వాత ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛ పట్టడం మరో విశేషం. ఈ యోగాల వల్ల ఉద్యోగంలో పదవీ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా పుంజుకోవడం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం జరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. గౌరవమర్యాదలు బాగా ఇనుమడిస్తాయి.
  2. వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛ బలం సంపాదించుకుంటున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. అనేక శుభవార్తలు వింటారు. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుం బంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందివస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశ్యధిపతి చంద్రుడికి దశమ స్థానంలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత వృషభంలో ఉచ్ఛపట్టడం వల్ల విపరీత రాజయోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అందలాలు ఎక్కడంతో పాటు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. మొండి వ్యాధుల నుంచి బయటపడడం జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత చంద్రుడు దశమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యో గులకు కోరుకున్న సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత దశమాధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల, ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలపరంగా వృద్ధి చెందడం, విస్తరించడం జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. కోరుకున్న లేదా ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది.
  6. మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో గజకేసరి యోగం పడుతుండడం, పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపడుతుండడం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రధానమైన ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్ప డుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా