AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Yogas: మూడు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి మహా యోగాలు పక్కా..!

ప్రస్తుతం కుజ, శుక్ర, శని గ్రహాలు తమ స్థానాల్లో తాము బలమైన సంచారం చేస్తున్నాయి. ఫలితంగా ఈ మూడు గ్రహాలకు చెందిన రాశులు బాగా యాక్టివ్ కాబోతున్నాయి. ధన సంపాదనతో సహా అనేక విధాలైన పురోగతుల వైపు ఈ రాశులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఈ రాశులు రాబోయే రోజుల్లో తప్పకుండా అభివృద్ధిని సాధించే యోగం ఉంది.

Maha Yogas: మూడు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి మహా యోగాలు పక్కా..!
Maha Yogas
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 04, 2024 | 7:00 PM

Share

ప్రస్తుతం కుజ, శుక్ర, శని గ్రహాలు తమ స్థానాల్లో తాము బలమైన సంచారం చేస్తున్నాయి. ఫలితంగా ఈ మూడు గ్రహాలకు చెందిన రాశులు బాగా యాక్టివ్ కాబోతున్నాయి. ధన సంపాదనతో సహా అనేక విధాలైన పురోగతుల వైపు ఈ రాశులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఈ రాశులు రాబోయే రోజుల్లో తప్పకుండా అభివృద్ధిని సాధించే యోగం ఉంది. కుజుడు అధిపతి అయిన మేష, వృశ్చికాలు, శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ, తులా రాశులు, శని అధిపతిగా ఉన్న మకర, కుంభ రాశులు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితం మరో నెలన్నర పాటు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఈ రాశివారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. పరిస్థితులన్నీ చక్కబడడంతో పాటు, ఈ రాశి వారికి బాగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్లు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  2. వృషభం: ఈ రాశి అధిపతి శుక్రుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి జీవితం అలవడుతుంది. కలలో కూడా ఊహించని భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా అభివృద్ది చెందుతాయి.
  3. తుల: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరి ప్రయ త్నాలన్నీ సఫలం అవుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వీరి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపా రాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకుంటారు. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు స్వస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారికి దాదాపు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. రాజయోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బాట పట్టే సూచనలున్నాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పోటీదార్లు, శత్రువులు అణగిమణగి ఉంటారు.
  5. మకరం: ఈ రాశి నాథుడైన శనీశ్వరుడు ధన స్థానంలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఆర్థి కంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఆర్థికపరమైన అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా బాగా వృద్ధి చెందుతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు భారీ జీతభత్యాలిచ్చే ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఉద్యోగులకు మరింత మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంట్లో వైభవంగా శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.
  6. కుంభం: ఈ రాశ్యధిపతి శని స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ నష్టాల నుంచి బయటపడడం, లాభా లపరంగా పుంజుకోవడం వంటివి జరుగుతాయి. సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి బయటపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. సంపద నిలకడగా వృద్ధి చెందుతుంది.