Astrology: కీలక గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!

| Edited By: Janardhan Veluru

Aug 04, 2024 | 7:29 PM

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మరో రెండు నెలల పాటు నాలుగు స్థిర రాశులతో పాటు మిథునం, ధనస్సు వంటి ద్విస్వభావ రాశులు సైతం ఒక వెలుగు వెలగబోతు న్నాయి. ఈ రాశులకు శుక్ర, బుధ, గురువులు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల తప్ప కుండా ఆదాయ యోగాలు, అధికార యోగాలు, ఆరోగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది.

Astrology: కీలక గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!
Astrology
Follow us on

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మరో రెండు నెలల పాటు నాలుగు స్థిర రాశులతో పాటు మిథునం, ధనస్సు వంటి ద్విస్వభావ రాశులు సైతం ఒక వెలుగు వెలగబోతు న్నాయి. ఈ రాశులకు శుక్ర, బుధ, గురువులు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల తప్ప కుండా ఆదాయ యోగాలు, అధికార యోగాలు, ఆరోగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ మూడు శుభ గ్రహాలు ఒకేసారి కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది.

  1. వృషభం: ఈ రాశిలో గురువు, చతుర్థ కేంద్రంలో బుధ, గురువులు కలలో కూడా ఊహించని శుభ ఫలితాల నిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన, వస్తు లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు, సంపద బాగా కలిసి వస్తాయి.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల లాభదాయక పరిచ యాలు పెరగడం, మంచి ఒప్పందాలు కుదరడం, ఆదాయం దిన దినాభివృద్ధి చెందడం, కుటుం బంలో శుభ కార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా తప్ప కుండా ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రయాణాల వల్ల బాగా లాభముంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. జీవనశైలి అనూహ్యంగా మెరుగుపడుతుంది.
  3. సింహం: ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదాలతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలను కీలక మార్పుల ద్వారా లాభాల బాట పట్టించడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పుంజుకుంటుంది. రావలసిన డబ్బు అందుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, బుధులు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల అనేక ధన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక సమస్యల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, శుక్రులు కలిసి ఉండడం, ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం చేయడం వల్ల అనేక శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరు గుతుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పితృమూలక ధన లాభం ఉంటుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవు తాయి. వ్యక్తిగత సమస్యలు కూడా బాగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశికి సప్తమంలో శుక్ర, బుధులు, చతుర్థ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గడంతో పాటు రాబడి పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పడతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందే సూచనలున్నాయి.