ఈ రాశుల వారికి కార్యదక్షత ఎక్కువ.. పని మొదలుపెడితే మధ్యలో వదిలిపెట్టరు..!

| Edited By: Janardhan Veluru

Jul 19, 2024 | 7:10 PM

జాతక చక్రంలో మొత్తం 12 రాశులున్నప్పటికీ, వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. ఇందులో ఆరు రాశుల వారు ఏ పనైనా మొదలుపెడితే మధ్యలో వదిలిపెట్టడం జరగదు. అది పూర్తయ్యే దాకా నిద్రపోరు. సాధారణంగా ఉద్యోగంలో అధికారులు ఇటువంటి లక్షణాలు ఉన్నవారి మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. వీరి మీద నమ్మకాన్ని పెంచుకుంటారు.

ఈ రాశుల వారికి కార్యదక్షత ఎక్కువ.. పని మొదలుపెడితే మధ్యలో వదిలిపెట్టరు..!
Zodiac Signs
Follow us on

జాతక చక్రంలో మొత్తం 12 రాశులున్నప్పటికీ, వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. ఇందులో ఆరు రాశుల వారు ఏ పనైనా మొదలుపెడితే మధ్యలో వదిలిపెట్టడం జరగదు. అది పూర్తయ్యే దాకా నిద్రపోరు. సాధారణంగా ఉద్యోగంలో అధికారులు ఇటువంటి లక్షణాలు ఉన్నవారి మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. వీరి మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఈ ఆరు రాశులుః వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులు. వీరు అనుకున్నవి సాధిస్తారు. వీరిలో కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వీరు చేపట్టే పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి.

  1. వృషభం: ఈ రాశివారు ప్రతి పనినీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం జరుగుతుంటుంది. నిదానంగా పూర్తి చేసే అలవాటు ఉన్నప్పటికీ, చక్కగా, లోపరహితంగా పూర్తి చేస్తారు. ఈ ఏడాది వీరు ఉద్యోగంలో వీరి పనితీరుకు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలను నష్టాల్లోంచి బయటకు తీసుకు వచ్చి లాభాల బాట పట్టిస్తారు. ఆర్థికంగా తమ స్థితిగతుల్ని మెరుగుపరచుకుంటారు. ఏదైనా కంపెనీని లేదా స్టార్టప్ సంస్థను ప్రారంభించే పక్షంలో వీరు తప్పకుండా విజయం సాధిస్తారు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ఎటువంటి కష్టనష్టాలనైనా, ఏ సమస్యనైనా ముందుగానే గ్రహించడం, పసికట్టడం సాధ్యమవుతుంది. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ ప్రయత్నం తలపెట్టాలి అనే విషయాల్లో వీరు ముందుగానే ఒక అంచనాకు రావడం జరుగుతుంది. అందువల్ల వీరు అటు వృత్తి, ఉద్యోగాల్లో ఇటు కుటుంబంలో లోపాలను అధిగమిస్తూ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఒక పథకం ప్రకారం ఆదాయాన్ని పెంచుకుంటారు. గృహ, వాహనాలను సమకూర్చుకుంటారు.
  3. సింహం: ఈ రాశివారు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎంత కాలమైనా నిరీక్షించడం జరుగుతుంది. సమ యస్ఫూర్తిగా, చాకచక్యంగా, లౌక్యంగా వ్యవహరించడంలో వీరికి వీరే సాటి. వృత్తి, ఉద్యోగాల్లో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి, అధికారుల ఆదరణ చూరగొని అందలాలు ఎక్కడం జరుగుతుంది. ధన సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేసి, ఆర్థిక సమస్యలను అధిగమించడమే కాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. సొంత ఇంటిని, వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
  4. కన్య: ఏ సమస్యనైనా ముందుగానే అన్ని కోణాల నుంచి పరిశీలించడంలో ఈ రాశివారు ముందుం టారు. ఓర్పు, సహనాలతో వ్యవహరించి సమస్యలను నిదానంగా పరిష్కరించుకుంటారు. వీరికి దూర దృష్టి ఎక్కువ. అందువల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ ఆశించిన పురోగతి సాధిం చడానికి వీరు శక్తియుక్తులన్నిటినీ వినియోగించి అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయాన్ని కూడగట్టుకుంటారు.
  5. వృశ్చికం: వీరికి ఏ విషయంలోనైనా స్థిరమైన భావాలుంటాయి. పట్టు విడుపులుండవు. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తి చేసేవరకూ నిద్రపోరు. ఈ ఏడాది ఈ రాశివారి దృష్టి సంపాదన మీద పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి సంపద కూడగట్టుకోవడానికి వీరు పథకాలు రూపొందించి, విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికారులను పనితీరుతో మెప్పించి జీతభత్యాలు పెంచుకోవడం, వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు చేపట్టి రాబడి పెంచుకోవడం జరుగుతుంది.
  6. మకరం: మొండి పట్టుదలకు, సహనానికి, రాజీపడని ధోరణికి మారుపేరైన ఈ రాశివారు ఈ ఏడాది మంచి గుర్తింపు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుద లతో పాటు గౌరవ మర్యాదల కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ప్రతిభా పాటవాలను, నైపుణ్యా లను పెంచుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలను గట్టి పట్టుదలతో పరి ష్కరించుకుంటారు. నిబ్బరంగా, నిదానంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు.