Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!

|

Dec 01, 2021 | 9:27 PM

స్నేహితుల మధ్య చిన్న చిన్న వ్యవహరాలకే తరచూ అపార్ధాలు, కొట్లాటలు జరుగుతుంటాయి. అవి ఏవైనా కావచ్చు...

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!
Zodiac Signs
Follow us on

స్నేహితుల మధ్య చిన్న చిన్న వ్యవహరాలకే తరచూ అపార్ధాలు, కొట్లాటలు జరుగుతుంటాయి. అవి ఏవైనా కావచ్చు. ఇద్దరూ గొడవపడినా.. కాసేపటి తర్వాత అంతా మర్చిపోయి.. మళ్లీ ఒకటైపోతారు. అలాంటి వాటిని ఎమోషనల్‌గా తీసుకోరు. జీవితాంతం పగతో బ్రతకడం చాలా సులభం.. కానీ ఎదుటివారు చేసిన తప్పులను క్షమించి.. వాటిని మర్చిపోయి ధైర్యం చాలా అవసరం. ఇలా చేసేవారు చాలా అరుదు. జోతిష్యశాస్తం ప్రకారం.. మూడు రాశులవారు పగను పెంచుకుంటారట. తమను మోసం చేసినవారిపై, అలాగే తేలికగా తీసుకున్నవారిపై కోపాన్ని పెంచుకుంటారట. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

మిధునరాశి:

ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా దయ కలిగినవారు. వీరికి చాలామందితో శత్రుత్వం ఉంటుంది. ఇతరులు తమకు చేసిన చెడును వీరి అస్సలు మర్చిపోరు. అలాంటి వారిని తమ జీవితంలో నుంచి చెరిపేయాలని అనుకుంటారు. ఎవరైనా కూడా వీరి మాటలను తేలికగా తీసుకుంటే.. క్షణాల్లో కోపం వచ్చేస్తుంది. వారి విశ్వసనీయతను కూడా దెబ్బతీయడానికి వెనుకాడరు. వీరు కోపం వచ్చినప్పుడు.. ఏం మాట్లాడతారో.. ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు.

వృషభరాశి:

ఈ రాశివారు తమను బాధపెట్టిన వారిని అస్సలు క్షమించరు. వీరిని ఇతరులు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినా.. వారి నుంచి విడిపోవడానికి సిద్దంగా ఉంటారు. జీవితంలో మళ్లీ ఆ వ్యక్తి ముఖాన్ని కూడా చూడరు.

మకరరాశి:

ఈ రాశివారు ఎవ్వరినీ సులభంగా క్షమించరు. మీరు ఒకసారి వారి నమ్మకాన్ని కోల్పోతే, దాన్ని మళ్లీ తిరిగి పొందటానికి మీకు జీవితకాలం పడుతుంది. తమకు హాని తలపెట్టిన వారిని ఈ రాశివారు అస్సలు వదిలిపెట్టరు. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. అయితే వీరితో మంచిగా ఉన్నట్లయితే.. ప్రపంచంలో ఇంతకన్నా బెస్ట్ పర్సన్స్ ఎవ్వరూ ఉండరనుకునేలా మీతో ఉంటారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!