
దిన ఫలాలు (మే 17, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఉద్యోగ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండకపోవచ్చు. రాబడికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు కూడా బాగా తగ్గు ముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
ఇంటా బయటా బాధ్యతలు, పనుల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో అంచనాల్ని మించి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి చక్కబడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం అవసరం. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో లక్ష్యాలు, ఇతర బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు కూడా వసూలవుతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ విషయాల్లో బంధువులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరో గ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఉన్నా ఫలితం ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దల సహాయంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
ఉద్యోగులకు జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా లాభాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకుంటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వింటారు. ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పనిభారం వల్ల విశ్రాంతి తగ్గుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తప్పవు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులకు అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది.
ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒకరిద్దరు బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.