Solar Eclipse 2024: అక్టోబర్ 2 సూర్యగ్రహణం.. ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..

|

Sep 26, 2024 | 7:20 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబరు 2న ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల ప్రజల మనస్సుపై ప్రభావం ఉండనుంది. ఈ గ్రహణ ప్రభావం మొత్తం 12 రాషులమీద చూపించినా రెండు రాశుల మీద మాత్రం అధికంగా ఉండనున్నదట. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..సర్వపితృ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2 న ఏర్పడనున్న సూర్యగ్రహణం కన్య రాశిలో ఏర్పడనుంది. దీంతో కన్య , మీన రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

Solar Eclipse 2024: అక్టోబర్ 2 సూర్యగ్రహణం.. ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..
Solar Eclipse
Follow us on

హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్య గ్రహణం అమావాస్య తిథిలో చంద్ర గ్రహణం పౌర్ణమి తిథిలలో ఏర్పడతాయి. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడనుంది. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రప్రద మాసంలోని అమావాస్య పితృపక్షం చివరి రోజు. ఈ రోజున భూమికి వచ్చిన పూర్వీకులు భూమికి వీడ్కోలు చెబుతారని నమ్మకం. అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు.. అయినప్పటికీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రపంచాన్ని, మానవ జీవితంపై ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబరు 2న ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల ప్రజల మనస్సుపై ప్రభావం ఉండనుంది. ఈ గ్రహణ ప్రభావం మొత్తం 12 రాషులమీద చూపించినా రెండు రాశుల మీద మాత్రం అధికంగా ఉండనున్నదట. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

సర్వపితృ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2 న ఏర్పడనున్న సూర్యగ్రహణం కన్య రాశిలో ఏర్పడనుంది. దీంతో కన్య , మీన రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కన్య రాశికి చెందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో మీన రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. కనుక ఈ గ్రహణ ప్రభావం ఈ రాశివారిపై చూపనుంది. కనుక కన్య, మీన రాశికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

గ్రహణాన్ని హిందువులు ప్రతికూల సమయంగా పరిగణిస్తారు. సూర్యగ్రహణం అశుభకరంగా పరిగనిస్తారు. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటారు. సూర్యగ్రహణం సమయంలో పూజ, శుభకార్యాలు వంటి చేయరాదు.

భారత దేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా..

అక్టోబర్ 2వ తేదీన ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీంతో ఇక్కడ సూత కాలం లేదు. వాస్తవానికి హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య గ్రహణానికి 12 గంటల ముందు నుంచి సూత కాలం ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో వాతావరణంలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుదని కనుక ఈ సమయం అశుభంగా భావిస్తారు. గ్రహణ సమయంలో రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది కనుక గ్రహణ సమయంలో తినడం, తాగడం నిషేధం అనే నియమం పెట్టారు పెద్దలు.

ఏ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుందంటే

నాసా వెబ్‌సైట్ ప్రకారం ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలో కంకణాకార సూర్యగ్రహణం కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికాలో పాక్షిక గ్రహణంగా కనిపించనుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ ఎర్రటి వలయాకారం ఏర్పడుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి