
గ్రహాల రాజు సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుని రాశి మార్పు దాని నిర్ణీత సమయంలో జరుగుతుంది. సూర్యుడు ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని సూర్య గోచారం లేదా సంక్రాంతి అంటారు. 2025 జూలై నెలలో సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టి ఈ రాశిలో సంచారము చేయబోతున్నాడు. సూర్యుని మార్పుతో ఈ రోజుని కర్కాటక సంక్రాంతి అంటారు.
ఈ సూర్య సంచారము జూలై 16 బుధవారం నాడు జరిగింది. దీనిని కర్కాటక సంక్రాంతి అంటారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు.. సూర్యుడు ఈ రోజు నుంచి 30 రోజులు కర్కాటకంలోనే ఉంటాడు. కర్కాటకం మనస్సు, భావోద్వేగాలు, చంచలత్వానికి కారకుడైన చంద్రునికి సంబంధించినది. అందుకే చంద్రుని రాశిలో సూర్య సంచారము చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సూర్య సంచారము అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి సంక్రాంతి శుభ సమయం ఉదయం 05:40 గంటలకు, సాయంత్రం 5.40 గంటల వరకు ఉంటుంది.
ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందంటే
కర్కాటక రాశి: కర్కాటక రాశిలో సూర్య సంచారం జరగనుండడంతో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి విశ్వాసం పెరుగుతుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. వీరు ఏపని మొదలు పెట్టినా ఈ సమయంలో విజయం సాధిస్తారు. దీనితో పాటు, ఉద్యోగస్తులకు తమ ఆఫీసులో హోదా, ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం శుభప్రదమైనది. ప్రయోజనకరమైనది. ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన రాజకీయనాయకులకు ఈ సమయం శుభ సమయం. వీరు చెప్పే ప్రసంగం ప్రజలను ఉత్సావవంతులను చేస్తుంది. వీరి ప్రభావాన్ని పెంచుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి శుభసమయం. వీరు అన్ని విధాలా ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశి: వారికి ఈ సమయం శుభప్రదం. ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయోజనం పొందుతారు. ఏపని మొదలు పెట్టినా అది పూర్తవుతుంది. విద్య, మతపరమైన కార్యకలాపాలలో పురోగతి సాధిస్తారు. తండ్రి నుంచి వీరికి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా పని పూర్తవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.