జ్యోతిశాస్త్రంలో సూర్య చంద్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు, సూర్యుడు రెండూ శుభ గ్రహాలుగా పిలుస్తారు. చంద్రుడు మనస్సుకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మను నియంత్రించే గ్రహం. తొమ్మిది గ్రహాలలో రాశిచక్రం, నక్షత్రరాశిని అత్యంత వేగంగా మార్చే గ్రహం చంద్రుడు. అందువల్ల చంద్రుడు ఇతర గ్రహాలతో ఎక్కువసార్లు కలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే జనవరి 28న మకరరాశిలో సూర్యచంద్రుల కలయిక ఏర్పడుతోంది. సూర్య చంద్రుల కలయిక మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిశాస్త్రం ప్రకారం.. జనవరి 28 మంగళవారం మధ్యాహ్నం 2:51 గంటలకు చంద్రుడు ధనుస్సు నుండి బయటకు వెళ్లి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఇప్పటికే అక్కడ ఉంటాడు. వాస్తవానికి సూర్యుడు జనవరి 14న ఉదయం 9:03 గంటలకు మకరరాశిలో సంచరిస్తాడు. ఫిబ్రవరి 12, 2025 రాత్రి 10:3 గంటల వరకు ఈ రాశిలో ఉంటాడు. ఈ క్రమంలోనే జనవరి 28న మకరరాశిలో సూర్యచంద్రుల కలయిక ఉంటుంది. ఇది కొన్ని రాశులవారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు.
ఈ 3 రాశుల వారికి సూర్యచంద్రుల కలయిక శుభప్రదం:
మేష రాశి: మకరరాశిలో ఏర్పడిన సూర్యచంద్రుల కలయిక మేష రాశి వారిపై అత్యంత అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వీరికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కళ, సంగీతం, ఫ్యాషన్ మొదలైన సృజనాత్మక రంగాలలో పనిచేసే వ్యక్తులు వారి కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.. వ్యాపారస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దాని కారణంగా వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. వివాహితులకు ఖర్చులు తగ్గుతాయి, వారికి పొదుపు పెరుగుతుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది
వృశ్చిక రాశి: సూర్యచంద్రుల కలయిక వృశ్చిక రాశి వారిపై కూడా శుభ ప్రభావం చూపుతుంది. వివాహితులకు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది. అదృష్ట బలం కారణంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ శుభవార్తలను వింటారు. విద్యార్థులకు భక్తి, ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన విహారయాత్రలకు వెళ్తారు. సొంతింటి కల నెరవేరనుంది. సంతోషంగా గడుపుతారు. సకల భౌతిక ఆనందాన్ని పొందుతారు.
మకర రాశి: మకర రాశి వారికి కూడా సూర్యచంద్రుల కలయిక చాలా శుభప్రదం అంటున్నారు నిపుణులు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో గతంలో కంటే ఎక్కువ ఆనందం పొందుతారు. పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. మకర రాశి వారికి సొంతంగా కారు కొనాలన్న కల జనవరి నెలాఖరు నాటికి నెరవేరే అవకాశం ఉంది. సొంత దుకాణం ఉన్నవారు లేదా ఐరన్ సంబంధిత వ్యాపారం చేస్తున్నవారు అకస్మాత్తుగా ధన లాభాన్ని పొందుతారు.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..