Sun Transit: రవి రాశి మార్పు.. నెల రోజులు ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Dec 08, 2024 | 12:51 PM

Shubh Yogas: ఈ నెల (డిసెంబర్) 16 నుంచి జనవరి 16 వరకూ రవి ధనుస్సు రాశిలో సంచారం చేయనుంది. ఈ ధనుర్మాసంలో గురువుకు సంబంధించిన రాశిలో రవి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా కొన్ని శుభ యోగాలు కలిగే అవకాశముంది. రవికి ధనూ రాశి మిత్ర క్షేత్రం అయినందువల్ల తప్పకుండా పూర్ణ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.

Sun Transit: రవి రాశి మార్పు.. నెల రోజులు ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
Sun Tranist In Dhanussu Rashi
Follow us on

Telugu Astrology: ఈ నెల 16 నుంచి జనవరి 16 వరకూ రవి ధనుస్సులో సంచారం చేయడం జరుగుతోంది. ఈ ధనుర్మాసంలో గురువుకు సంబంధించిన రాశిలో రవి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా కొన్ని శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. రవికి ధనూ రాశి మిత్ర క్షేత్రం అయినందువల్ల తప్పకుండా పూర్ణ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులకు పదోన్నతులు కలగడం, సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు విస్తరించడం, ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభించడం, వివాదాల్లో విజయం, తండ్రి నుంచి ఆస్తి కలసి రావడం వంటివి జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా తండ్రి నుంచి ఆస్తి పాస్తులు, ఇతరత్రా సహాయ సహకారాలు లభించడం వంటివి జరుగుతాయి. ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు అభించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తు న్నవారు విజయాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.
  2. సింహం: రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి పెరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు లాభాలను తెచ్చిపెడతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధి స్తారు. సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి.
  3. తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు, బాకీలు తప్పకుండా చేతికి అందుతాయి. సోదరులతో ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా రవి దన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగపరంగా ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాలు ఆర్జిం చడం ప్రారంభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. కుటుంబ జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం.
  5. ధనుస్సు: భాగ్యాధిపతిగా రవి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక అదృష్టాలు కలుగు తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవ కాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఇతరత్రా కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి.
  6. కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం కూడా చాలావరకు తగ్గి పోతుంది. ప్రభుత్వపరంగా లాభాలు కలుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సరైన వైద్య చికిత్స లభిస్తుంది. తండ్రి నుంచి వారసత్వ సంపద అందు తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.