
Shubh Yoga
మీన రాశిలో గ్రహ రాజు రవి ప్రవేశించడం అన్నది ఎంతో శుభప్రదమైన విషయం. తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో ప్రవేశించడం వల్ల రవికి దాదాపు ఉచ్ఛ స్థితి లభిస్తుంది. మీన రవి తనకు అనుకూలమైన రాశులకు అధికార లాభం, సంపద లాభం, ఆరోగ్యం లాభం అందిస్తాడు. ఈ నెల 15న మీన రాశిలో ప్రవేశించిన రవి ఏప్రిల్ 15 వరకూ ఇదే రాశిలో కొనసాగుతాడు. రాజకీయాలు, ప్రభుత్వం, అధికారం, సంపద, ఆరోగ్యం, నాయకత్వం వంటి అంశాలకు కారకుడైన రవి వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారిని అనేక విధాలుగా అనుగ్రహించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు సునాయాసంగా ఫలవంతం అవుతాయి. కుటుంబంలో సమస్యలు, వివాదాలు పరిష్కారమై, సఖ్యత, సాన్నిహిత్యం పెంపొందుతాయి. ఆస్తి పాస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
- మిథునం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన రవి దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు కూడా వైభవం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్ప కుండా సఫలం అవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు సమసిపోతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశిని ధన స్థానాధిపతి అయిన రవి భాగ్య స్థాన సంచారం వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. తండ్రి వైపు నుంచి స్థిర, చరాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానమైన మీన రాశిలో రవి సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కష్ట నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతాయి. రాజకీయ ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవి పంచమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించని ఉన్నత పదవులు లభిస్తాయి. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా ప్రయోజనం పొందుతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే సూచనలు న్నాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.